Ivana: అందానికి అదృష్టం తోడైతేనే బాగుంటుందేమో!

- కోలీవుడ్ లో బిజీగా ఉన్న ఇవాన
- తెలుగులో పట్టు కోసం ప్రయత్నాలు
- ఈ నెల 9న రానున్న 'సింగిల్'
- హిట్ ఖాయమంటున్న బ్యూటీ
వెండితెరపై హీరో ఎన్ని సాహసాలు .. పోరాటాలు చేసినా, ఆయన హీరోయిన్ తో కలిసి పాడుకునే సమయం కోసమే ఆడియన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. అలాగే హీరో సామాజిక సేవలో ఎంతగా తరిస్తూ ఉంటాడనే దానికంటే, ఆయన హీరోయిన్ తో కలిసి చేసే రొమాన్స్ కోసం ఆడియన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. హీరో కోసం థియేటర్ కి వచ్చినా, హీరోయిన్ ఎప్పుడు తెరపైకి వస్తుందా అని ఎదురుచూడని మాస్ ఆడియన్స్ దాదాపుగా ఉండరు.
అందుకనే హీరోయిన్స్ అందంగా ఉండేలా మేకర్స్ శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. అలాంటి అందాల హీరోయిన్స్ జాబితాలో ఈ మధ్య 'ఇవాన' కనిపిస్తోంది. తమిళంలో నెక్స్ట్ లెవెల్ హీరోయిన్స్ బౌండరీలోకి అడుగుపెట్టడానికి ట్రై చేస్తున్న ఈ బ్యూటీ, ఒక హిట్ తో తెలుగు ఆడియన్స్ ముందుకు రావడానికి ఆరాటపడుతోంది. అలా ఆమె చేసిన సినిమానే 'సింగిల్'. శ్రీవిష్ణు జోడీగా ఆమె నటించిన ఈ సినిమా, ఈ నెల 9వ తేదీన థియేటర్లకు వస్తోంది.
కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తాను 'హరిణి' అనే పాత్రలో కనిపిస్తాననీ, ఈ పాత్ర తనకి మంచి గుర్తింపు తెచ్చిపెడుతుందనే నమ్మకంతో ఇవాన ఉంది. విశాలమైన కళ్లతో .. నవరసాలను నాజూకుగా పలికించే ఈ సుందరికి, ఇక్కడ కూడా అభిమానుల సంఖ్య ఎక్కువే. అందం విషయంలో అమ్మడికి ఢోకా లేదు. కాకపోతే అదృష్టం కూడా తోడుకావాలంతే అంటున్నారు ఫ్యాన్స్. ఈ సినిమాతో తెలుగులోనూ ఈ బ్యూటీ బిజీ అవుతుందేమో చూడాలి మరి.

