Parannu Parannu Parannu Chellan: ఓటీటీ తెరపైకి మలయాళ రొమాంటిక్ థ్రిల్లర్!

Parannu Parannu parannu Chellai Movie Update
  • మలయాళం నుంచి రొమాంటిక్ థ్రిల్లర్
  • లవర్స్ చుట్టూ తిరిగే కథ 
  • మనోరమా మ్యాక్స్ లో అందుబాటులోకి  
  • ఈ నెల 16 నుంచి స్ట్రీమింగ్

మలయాళం నుంచి ఇప్పుడు మరో రొమాంటిక్ థ్రిల్లర్ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఆ సినిమానే 'పరన్ను పరన్ను పరన్ను చెల్లన్'. టైటిల్ కాస్త పొడవుగా అనిపిస్తుంది గానీ, మలయాళంలో ఓ ఫీల్ తో కూడిన సూపర్ హిట్ సాంగ్ లోని వాక్యం ఇది. విష్ణు రాజన్ రాసిన ఈ కథను జిష్ణు హరీంద్రవర్మ తన దర్శకత్వంలో తెరకెక్కించాడు. 

ఈ ఏడాది జనవరిలో థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. జాయ్ జినిత్ - రామ్ నాథ్ సంగీతం, మధు అంబట్  ఫొటోగ్రఫీ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ఉన్నీలాల్ .. సిద్ధార్థ్ భరతన్ .. ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు. 

కథ విషయానికి వస్తే, సంధ్య - బిజూ ప్రేమించుకుంటారు .. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. అయితే అబ్బాయి కులం వేరే కావడం వలన, ఆమె ఇంట్లోవారు ఒప్పుకోరు. వాళ్ల కారణంగా తనకి జరిగిన అవమానానికి ప్రతీకగా, సంధ్యను తీసుకుని ఊరొదిలి వెళ్లిపోవాని అనుకుంటాడు? ఆ నిర్ణయం ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? అనేది కథ 

Parannu Parannu Parannu Chellan
Malayalam Romantic Thriller
OTT Release
Vishnu Rajan
Jishnu Harindavarma
Unni Lal
Siddharth Bharathan
Malayalam Cinema
Romantic Thriller Movies
OTT Platform

More Telugu News