Gali Janardhan Reddy: ఓబులాపురం మైనింగ్ కేసులో గాలి జనార్ధన్ రెడ్డి సహా మరో నలుగురిని దోషులు ప్రకటించిన సీబీఐ కోర్టు... సబితకు క్లీన్ చిట్

- వి.డి. రాజగోపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అలీఖాన్ లను దోషులుగా ప్రకటించిన కోర్టు
- సబితతో పాటు మాజీ ఐఏఎస్ కృపానందంకు క్లీన్ చిట్
- ఇప్పటికే ఐఏఎస్ శ్రీలక్ష్మిని నిర్దోషిగా ప్రకటించిన హైకోర్టు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేపిన ఓబులాపురం మైనింగ్ కేసులో ఐదుగురికి హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టు ఐదుగురిని దోషులుగా తేలుస్తూ తీర్పును వెలువరించింది. ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించింది. గాలి జనార్ధన్ రెడ్డి (ఏ2), ఆయన పీఏ అలీఖాన్ (ఏ7)), వి.డి.రాజగోపాల్ (ఏ3), శ్రీనివాస్ రెడ్డి (ఏ1), ఓబులాపురం మైనింగ్ కంపెనీని దోషులుగా ప్రకటిస్తూ తీర్పును వె మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి, మాజీ ఐఏఎస్ అధికారి కృపానందంకు క్లీన్ చిట్ ఇచ్చింది. 2004 - 2009 మధ్య గనుల శాఖ మంత్రిగా సబిత పని చేశారు.
అనంతపురం జిల్లా కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసును సీబీఐ దర్యాప్తు చేసింది. ఈ కేసులో లుగా మొత్తం తొమ్మిది మంది నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిని ఇప్పటికే హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. వీరిలో ఒక నిందితుడు (లింగారెడ్డి) మృతి చెందారు. మిగిలిన ఏడు మందిలో ఇద్దరికి సీబీఐ కోర్టు క్లీన్ చిట్ ఇవ్వగా... మిగిలిన ఐదుగురిని దోషులుగా తేల్చింది. దోషులకు కోర్టు ఇంకా శిక్షను ఖరారు చేయలేదు. కాసేపట్లో శిక్షను ఖరారు చేసే అవకాశం ఉంది.