AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం .. నిందితులుగా ఆ ముగ్గురు కీలక వ్యక్తుల పేర్లు చేర్పు

AP Liquor Scam Three Key Figures Added as Accused
  • ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీలను నిందితులుగా చేర్చిన సిట్ 
  • ఈ మేరకు విజయవాడ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసిన సిట్ అధికారులు
  • వైసీపీ హయాంలో సీఎంఓ కార్యదర్శిగా పని చేసిన ధనుంజయరెడ్డి, జగన్ ఓఎస్డీగా పని చేసిన కృష్ణమోహన్ రెడ్డి 
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రభుత్వ మద్యం వ్యాపార లావాదేవీల్లో దాదాపు రూ.2600 కోట్లకు పైగా కుంభకోణం జరిగిందన్న అభియోగంపై కేసు నమోదు కాగా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ కేసులో గత ప్రభుత్వ హయాంలోని కీలక నేతలు, వ్యక్తులతో పాటు ఉన్నత స్థాయి అధికారులు నిందితులుగా ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రధాన నిందితుడు ఏ1 రాజ్ కెసిరెడ్డి, వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మాజీ వైసీపీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి తదితర ప్రముఖులను సహ నిందితులుగా పేర్కొన్న సిట్ అధికారులు తాజాగా, నాటి సీఎంవో కార్యదర్శిగా పనిచేసిన ధనుంజయరెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతి సిమెంట్స్ పూర్తికాలపు డైరెక్టర్ గోవిందప్ప బాలాజీలను ఈ కేసులో నిందితులుగా చేర్చారు. ఈ మేరకు సిట్ అధికారులు నిన్న విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో మెమో దాఖలు చేశారు.

తాజా పేర్ల నమోదుతో నిందితుల సంఖ్య 33కి చేరింది. ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్టయిన నలుగురు నిందితుల రిమాండ్ రిపోర్టుల్లోనూ.. కుంభకోణంలో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీల ప్రమేయం గురించి సిట్ స్పష్టంగా వెల్లడించింది. ఈ ముగ్గురు సాక్ష్యులను, కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో వారిని సిట్ నిందితులుగా చేర్చింది. 
AP Liquor Scam
Dhannunjaya Reddy
Krishna Mohan Reddy
Govindappa Balaji
Vijay Sai Reddy
Mithun Reddy
Raj Kసిరెడ్డి
SIT Investigation
Andhra Pradesh
Liquor Case

More Telugu News