Rahul Vaidya: కోహ్లీ కంటే అతడి అభిమానులే పెద్ద జోకర్లు అంటూ గాయకుడు రాహుల్ వైద్య వివాదాస్పద వ్యాఖ్యలు

Rahul Vaidyas Controversial Remarks on Virat Kohli and His Fans
  • కోహ్లీ తనను ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లాక్ చేశాడని రాహుల్ ఆరోపణ
  • తన వ్యాఖ్యల తర్వాత భార్య, కుటుంబాన్ని దూషించారని ఆవేదన
  • విరాట్ అభిమానులపై రాహుల్ వైద్య ఘాటు విమర్శలు
  • విమానాశ్రయంలో విలేకరులతో రాహుల్ సంభాషణ వైరల్
ప్రముఖ గాయకుడు, టెలివిజన్ వ్యాఖ్యాత రాహుల్ వైద్య మరోసారి భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ, ఆయన అభిమానులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ అభిమానులను ‘ఆయన కంటే పెద్ద జోకర్లు’ అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఇటీవల విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియోను 'ఇన్‌స్టంట్ బాలీవుడ్' తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్‌గా మారింది.

 కుటుంబ సభ్యులను దూషించడంపై ఆవేదన 
విమానాశ్రయంలో విలేకరులతో జరిగిన సంభాషణలో తాను విరాట్ కోహ్లీ గురించి వ్యాఖ్యానించిన తర్వాత తన భార్య, నటి దిశా పర్మార్, తన కుటుంబ సభ్యులను సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారని రాహుల్ వైద్య ఆవేదన వ్యక్తం చేశాడు. "నన్ను, నా కుటుంబాన్ని, నా భార్యను ఎలాంటి తిట్లు తిట్టారో, అది మంచిది కాదు" అని పేర్కొన్నాడు. ‘విరాట్ కోహ్లీ మిమ్మల్ని దూషించారా?’ అని రిపోర్టర్ ప్రశ్నించగా "ఆయన అభిమానులు దూషించారు అన్నారు. అందుకే ఆయన అభిమానులు ఆయన కంటే పెద్ద జోకర్లు అని నేను అన్నాను" అని రాహుల్ బదులిచ్చాడు.

బ్లాక్ చేయడంపై స్పందన
మీరు విరాట్‌ను దూషించారు కాబట్టే ఆయన అభిమానులు అలా ప్రతిస్పందించారని విలేకరులు చెప్పారు. దానికి ఆయన "నేను ఆయన్ని ఎక్కడ దూషించాను? నేను క్రికెట్ అభిమానిని. కానీ ఆయన నన్ను బ్లాక్ చేశారు. దానికి సమాధానం అయితే వస్తుంది కదా" అని రాహుల్ స్పష్టం చేశారు. "మిమ్మల్ని బ్లాక్ చేసేంత సమయం ఆయనకు ఎక్కడ ఉంటుంది?" అని ఎదురు ప్రశ్నించగా "మరి మాకు చాలా సమయం ఉంటుందా?" అంటూ రాహుల్ చమత్కారంగా సమాధానమిచ్చి విమానాశ్రయంలోకి వెళ్లిపోయారు.

గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు
గతంలో కూడా విరాట్ కోహ్లీ తనను ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లాక్ చేశాడని రాహుల్ వైద్య వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. "విరాట్ కోహ్లీ నన్ను బ్లాక్ చేశారని అందరికీ తెలుసు. బహుశా అది కూడా ఏదైనా సాంకేతిక లోపం (గ్లిచ్) వల్ల జరిగిందేమో. కోహ్లీ స్వయంగా చేసి ఉండకపోవచ్చు. బహుశా ఇన్‌స్టాగ్రామ్ అల్గారిథమ్ 'నీ తరపున రాహుల్ వైద్యను నేను బ్లాక్ చేస్తానులే' అని చెప్పిందేమో" అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా, తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ‘విరాట్ కోహ్లీ అభిమానులు విరాట్ కంటే పెద్ద జోకర్లు’ అని కూడా రాహుల్ పేర్కొన్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు రిపోర్టర్‌ను ప్రశంసిస్తూ వ్యాఖ్యలు చేయగా, మరికొందరు రాహుల్ వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు.
Rahul Vaidya
Virat Kohli
controversial comments
social media
Indian cricketer
singer
TV host
Disha Parmar
Instagram
viral video

More Telugu News