Bandi Srinivas: వైసీపీలో చేరిన ఏపీ ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు... కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జగన్

AP NGO Associations Bandi Srinivas Joins YSR Congress Party
  • మాట తప్పని నాయకుడు జగన్ అని బండి శ్రీనివాసరావు ప్రశంస
  • జగన్ మళ్లీ సీఎం అయ్యేందుకు పార్టీ కోసం పని చేస్తానని వ్యాఖ్య
  • ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్
ఏపీ ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు వైసీపీలో చేరారు. ఆయనకు జగన్ వైసీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ... మాట తప్పని, మడం తిప్పని నాయకుడు జగన్ అని కితాబునిచ్చారు. జగన్ లాంటి వ్యక్తిని మళ్లీ సీఎం చేసుకువాలనే బలమైన సంకల్పంతో పార్టీ కోసం పని చేస్తానని చెప్పారు. 

కూటమి ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని బండి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. పోలీసులకు సరెండర్ లీవులు ఇవ్వడం లేదని విమర్శించారు. ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న డీఏలను వెంటనే చెల్లించాలని అన్నారు. వైసీపీ ఎంప్లాయీస్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ... జగన్ కు మద్దతుగా ఉద్యోగ సంఘాల నేతలు పార్టీలో చేరుతున్నారని చెప్పారు.
Bandi Srinivas
YSRCP
Andhra Pradesh NGO Association
Jagan Mohan Reddy
AP Politics
Contract Employees
Regularization
Employee Demands
Chandra Sekhar Reddy

More Telugu News