Sri Vishnu: 'సింగిల్' సినిమాపై టాక్ ఇదే!

Singel Movie Update
  • ఈ రోజునే విడుదలైన 'సింగిల్'
  • ఫస్టాఫ్ బాగుందంటున్న ఆడియన్స్ 
  • వెన్నెల కిశోర్ కామెడీ హైలైట్ అంటూ టాక్ 
  • ఇకపై ఇక్కడ ఇవాన బిజీ అయ్యే ఛాన్స్ 

శ్రీవిష్ణు మంచి అందగాడు .. నిజం చెప్పాలంటే కామెడీ పల్స్ తెలిసిన రొమాంటిక్ హీరోనే అని చెప్పాలి. అలాంటి శ్రీవిష్ణు నుంచి తాజాగా వచ్చిన సినిమానే 'సింగిల్'. కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. గీతా ఆర్ట్స్ వారు నిర్మించిన ఈ సినిమాలో, శ్రీవిష్ణు జోడీగా కేతిక శర్మ - ఇవాన సందడి చేశారు. ఈ సినిమా నాన్ స్టాప్ ఎంటర్టైనర్ గా నవ్విస్తోందనే టాక్ బలంగా వినిపిస్తోంది. 

మొదటి నుంచి కూడా శ్రీవిష్ణు బలం కామెడీనే. అందువలన కథ ఏదైనా అది కామెడీతో ముడిపడి ఉండేలా ఆయన ప్లాన్ చేసుకుంటున్నాడు. శ్రీవిష్ణు ఉన్నాడు గనుక ఈ సినిమాలో కామెడీ విజృంభిస్తుందనీ .. కేతిక శర్మ కనిపించడం వలన ఘాటైన రొమాన్స్ ఉంటుందని ఆడియన్స్ ఒక అంచనాకు వచ్చారు. వాళ్ల అంచనాలకు తగినట్టుగానే ఈ సినిమా  ఉందని అంటున్నారు. ఫస్టాఫ్ అంతా ఫుల్ ఫన్ అంటూ ట్విట్టర్ లో తమ అభిప్రాయం చెబుతున్నారు.

ముఖ్యంగా శ్రీవిష్ణు - వెన్నెల కిశోర్ మధ్య జరిగే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తున్నాయని చెబుతున్నారు. చాలా కాలం తరువాత ఇటు శ్రీవిష్ణుకి .. అటు వెన్నెల కిశోర్ కి మంచి రోల్ పడిందని అంటున్నారు. తెలుగు ప్రేక్షకులకు 'లవ్ టుడే' సినిమాతో ఇవాన పరిచయమైంది. అప్పటి నుంచి స్ట్రైట్ తెలుగు సినిమాతో హిట్ కొట్టే సమయం కోసం వెయిట్ చేస్తూ వచ్చింది. ఆమె నిరీక్షణ ఈ సినిమాతో ఫలిస్తుందేమో చూడాలి.

Sri Vishnu
Single Movie
Kethika Sharma
Ivana
Venella Kishore
Telugu Cinema
Tollywood
Comedy Movie
Romantic Comedy
Geetha Arts

More Telugu News