Viral Video: పెళ్ల‌యిన మూడు రోజుల‌కే ఆర్మీ పిలుపు.. జవాన్ భార్య ఏమందంటే..!

Indian Jawan Departs for Duty 3 Days After Wedding
   
భార‌త్‌-పాకిస్థాన్ మ‌ధ్య యుద్ధ వాతావ‌ర‌ణం నెల‌కొన‌గా... వివాహ సెల‌వుల‌కు ఇంటికొచ్చిన జ‌వాన్‌కు ఆర్మీ నుంచి ఎమర్జెన్సీ కాల్ వ‌చ్చింది. దీంతో పెళ్ల‌యిన మూడు రోజుల‌కే భార్య‌ను వ‌దిలి విధుల కోసం దేశ స‌రిహ‌ద్దుకు వెళ్లిపోయారు. "నా సిందూరాన్ని దేశ ర‌క్ష‌ణ కోసం బార్డ‌ర్‌కు పంపుతున్నా" అంటూ న‌వ‌వ‌ధువు త‌న భ‌ర్త‌ను పంపించింది. 

వివ‌రాల్లోకి వెళితే... మహారాష్ట్ర‌లోని జల్గావ్‌లోని పచోరా తాలూకా పుంగావ్‌కు చెందిన జ‌వాన్‌ మనోజ్ జ్ఞానేశ్వర్ పాటిల్‌కు పచోరా తాలూకాలోని కలాంసర గ్రామానికి చెందిన యామినితో ఈ నెల 5న (సోమ‌వారం) పెళ్ల‌యింది. అయితే, మంగళవారం యుద్ధంలాంటి పరిస్థితిలో, వెంటనే విధుల‌కు హాజరు కావాలని అతనికి ఆదేశం వ‌చ్చింది. 

ఆ ఆదేశం మేర‌కు మే 8న (గురువారం) బార్డ‌ర్‌కు బయలుదేరాడు. జ‌వాన్ పాటిల్‌కు వీడ్కోలు పలికేందుకు నూతన వధువు, వారి కుటుంబ సభ్యులు, స్థానికులు కలిసి పచోరా రైల్వే స్టేషన్‌కు వ‌చ్చారు. దేశాన్ని రక్షించడానికి తన సిందూరాన్ని పంపుతున్నానని న‌వ‌వ‌ధువు యామిని పాటిల్ కు వీడ్కోలు పలుకుతూ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. వాటిపై నెటిజ‌న్లు త‌మ‌దైన‌శైలిలో స్పందిస్తున్నారు. 
Viral Video
Manoj Gyaneshwar Patil
Yamini Patil
Indian Army
Border Duty
Marriage
Patriotic Wife
India Pakistan Tension
Jalgaon
Maharashtra

More Telugu News