Etala Rajender: ఈటల మర్యాదస్తుడు అనుకున్నాం... కానీ మతి తప్పినట్టుంది: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Etala Rajenders Remarks Condemned by Telangana Govt Whip
  • సీఎం రేవంత్‌పై ఈటల వ్యాఖ్యల పట్ల ఆది శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం
  • ఈటల మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని విమర్శ
  • బీజేపీ అధ్యక్ష పదవి కోసం సీఎంను దూషిస్తున్నారని ఆరోపణ
  • అనుచిత భాష వాడితే సహించేది లేదని హెచ్చరిక
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. ఈటలను తాను ఒక మర్యాదస్తుడిగా భావించేవాడినని, కానీ ఆయన ఇటీవలి మాటలు చూస్తుంటే, మతి తప్పినట్లుగా ఉందని ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, "బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కావాలనుకుంటే మీ పార్టీ అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకోవాలి తప్ప, మా ముఖ్యమంత్రిని అసభ్య పదజాలంతో దూషిస్తే పదవి వస్తుందనుకోవడం మీ అవివేకానికి నిదర్శనం. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో మీరు ఈ స్థాయికి దిగజారతారని మేము ఊహించలేదు. దయచేసి మీ పిచ్చి వాగుడు, ప్రేలాపనలు ఆపండి" అని హితవు పలికారు.

ముఖ్యమంత్రిని 'శాడిస్ట్, సైకో' వంటి పదాలతో దూషించడంపై స్పందిస్తూ, "మాకు కూడా అంతకుమించిన భాషలో సమాధానం చెప్పడం వచ్చు, అది గుర్తుంచుకోండి. ముప్పై ఏళ్ల రాజకీయ అనుభవం ఉండి 'నా కొడకా' వంటి పదాలు వాడుతున్నారంటే మీ మానసిక పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. మీ నీచ రాజకీయ ప్రయోజనాల కోసం మా ముఖ్యమంత్రిపై దిగజారుడు భాష ఉపయోగిస్తే సహించే ప్రసక్తే లేదు" అని ఆది శ్రీనివాస్ హెచ్చరించారు.

ఈటల రాజేందర్ తన అనుచిత పదజాలాన్ని మానుకోకపోతే, తాము కూడా అంతకంటే తీవ్రమైన భాషను ఉపయోగించాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.
Etala Rajender
Adi Srinivas
BJP
Telangana
Revanth Reddy
Telangana Politics
Political Controversy
Insulting Remarks
Government Whip

More Telugu News