Narendra Modi: మన మహిళల సిందూరం తుడిచివేసిన వారికి బుద్ధి చెప్పడానికే 'ఆపరేషన్ సిందూర్': ప్రధాని మోదీ

Operation Sindhur PM Modis Response to Pulwama Attack
  • ఢిల్లీలో ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగం
  • పహల్గామ్ దాడి, తదనంతర పరిణామాలపై వివరణ
  • ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చిన ప్రధాని
పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం ఆపరేషన్ సిందూర్ నిర్వహించి పాకిస్థాన్ ను భారత్ చావుదెబ్బ కొట్టిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ మీడియా ముందుకు వచ్చారు. ఢిల్లీలో యావత్ భారతావనిని ఉద్దేశించి ప్రసంగించారు. పహల్గామ్ లో ఉగ్రవాదులు మతం పేరు అడిగి మరీ కుటుంబ సభ్యుల ముందే కాల్చి చంపారని వెల్లడించారు. ఈ భయానక ఉగ్రదాడితో దేశమంతా నివ్వెరపోయిందని, ఈ ఉగ్రదాడులపై ప్రతి హృదయం ప్రతీకార జ్వాలలతో రగిలిపోయిందని అన్నారు. 

"ప్రజలు, రాజకీయ పార్టీలు, అన్ని వర్గాల వారు ఒక్కతాటిపైకి వచ్చి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడ్డారు. భారతీయ మహిళల నుదుటిపై సిందూరం తుడిచివేసిన వారికి ఎలాంటి బుద్ధి చెప్పాలో... అదే ఆపరేషన్ సిందూర్. గత నాలుగు రోజులుగా భారత సైన్యం పోరాట సామర్థ్యాన్ని చూస్తున్నాం. ఉగ్రవాదులు కలలో కూడా ఊహించనంత దారుణంగా భారత్ దెబ్బతీసింది. ఉగ్రవాద శిబిరాలపై భారత్ క్షిపణులు, డ్రోన్లతో కచ్చితత్వంతో దాడులు చేశాయి. బహావల్ పూర్, మురిడ్కే వంటి తీవ్రవాద స్థావరాలపై దాడి చేయడం ద్వారా భారత్ బీభత్సం సృష్టించింది. 

ఈ సందర్భంగా మనదేశం అసమాన వీరత్వాన్ని ప్రదర్శించింది. మన నిఘా వర్గాల సామర్థ్యం, శాస్త్రసాంకేతిక సత్తా ఏంటనేది దేశం మొత్తానికి తెలిసింది. సైన్యం సాహసం, పరాక్రమాన్ని దేశం మొత్తం చూసింది. భారత రక్షణ దళాలు చూపిన ధైర్య సాహసాలు దేశానికి తలమానికంగా నిలుస్తాయి" అని కొనియాడారు.
Narendra Modi
Operation Sindhur
Pakistan
Pulwama attack
India
Surgical Strike
Counter Terrorism
Indian Army
National Security

More Telugu News