Blood Pressure Control: బీపీ, షుగర్ నియంత్రణలో ఉండాలంటే రోజూ పరగడపున ఇవి తీసుకోండి!

Control BP and Sugar Naturally Daily Morning Remedies
  • మధుమేహం, అధిక రక్తపోటు నియంత్రణకు జీవనశైలి కీలకం
  • పసుపు టీ, ఉసిరి, అవిసె గింజలతో చక్కెర, బీపీ అదుపు
  • దానిమ్మ రసం, దాల్చినచెక్క నీరు కూడా ప్రయోజనకరం
జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా బీపీ, షుగర్ బాధితులు వాటిని అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. రోజువారీ ఆహారపుటలవాట్లే బీపీ, షుగర్ లను నియంత్రిస్తాయని వారు విశ్లేషిస్తున్నారు. పరగడుపున కొన్ని ప్రత్యేకమైన పదార్థాలను తీసుకోవడం ద్వారా ఈ రెండు సమస్యలను నియంత్రణలో ఉంచుకోవచ్చని సూచిస్తున్నారు.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో పసుపు టీ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని, ముఖ్యంగా గ్లూకోజ్, రక్తపోటు స్థాయులను అదుపులో ఉంచడంలో ఇది సహాయపడుతుందని చెప్పారు. పసుపులోని కర్కుమిన్ యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉండి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది శరీరంలోని ఆక్సీకరణ ఒత్తిడిని కూడా తగ్గిస్తుందని తెలిపారు.

ఉసిరికాయలో విటమిన్ సీ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపర్చి, రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించడంలో సాయపడతాయని వైద్యులు తెలిపారు. యాంటీఆక్సిడెంట్లు అధిక రక్తపోటుకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ నష్టం నుంచి రక్షణ కల్పిస్తాయి.

అవిసె గింజల్లో పీచుపదార్థం (ఫైబర్), ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి రక్తపోటు, మధుమేహం రెండింటినీ నియంత్రించడంలో సహాయపడతాయి.

దానిమ్మ రసంలో కూడా యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికం. పరగడుపున దానిమ్మ రసం తాగడం వల్ల రక్తపోటు, మధుమేహం నియంత్రణలో ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. దాల్చినచెక్క నీరు ఇన్సులిన్ ప్రభావాన్ని అనుకరిస్తూ, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుందని, తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుందని వివరించారు. అంతేకాదు, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యానికి కూడా దోహదపడుతుందన్నారు.
Blood Pressure Control
Sugar Control
Turmeric Tea
Amla
Flax Seeds
Pomegranate Juice
Cinnamon Water
Diabetes Management
Hypertension
Healthy Diet

More Telugu News