Neeraj Chopra: అర్షద్ నదీమ్ తో తన ఫ్రెండ్షిప్ పై స్పందించిన నీరజ్ చోప్రా

- ఇటీవల పహల్గామ్ లో ఉగ్రదాడి... 26 మంది మృతి
- భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు
- పరిస్థితులు గతంలో లాగా ఉండకపోవచ్చన్న నీరజ్ చోప్రా
- జావెలియన్ త్రోయర్ల ప్రపంచం చిన్నదని వ్యాఖ్య
- క్రీడాకారులుగా అర్షద్, తాను ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం సహజమేనని వెల్లడి
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా, పాకిస్థానీ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్‌తో తన స్నేహంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. అర్షద్‌తో తనకు అంత బలమైన స్నేహబంధం లేదని, క్రీడాకారులుగా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం సహజమేనని స్పష్టం చేశారు. అయితే, ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తమ మధ్య పరస్పర చర్యలపై ప్రభావం చూపుతాయని అభిప్రాయపడ్డాడు.
జావెలిన్ త్రోయర్ల ప్రపంచం చిన్నదని, ప్రతి ఒక్కరూ తమ దేశం కోసం అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తారని పేర్కొన్నాడు. ప్రపంచవ్యాప్తంగా తనకు అథ్లెటిక్స్‌లో మంచి స్నేహితులున్నారని చెప్పారు. ఎవరైనా గౌరవంగా పలకరిస్తే, తాను కూడా అదే గౌరవాన్ని తిరిగి ఇస్తానని తెలిపాడు. అయితే, ఇటీవల పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా, పరిస్థితులు గతంలో ఉన్నట్లుగా ఉండకపోవచ్చని నీరజ్ చోప్రా వ్యాఖ్యానించాడు.
ప్రస్తుతం నీరజ్ చోప్రా ప్రతిష్ఠాత్మక దోహా డైమండ్ లీగ్‌లో మరోసారి పోటీపడేందుకు సిద్ధమయ్యాడు. 2023లో దోహాలో 88.67 మీటర్ల త్రోతో స్వర్ణం సాధించిన ఈ ఇండియన్ స్టార్ అథ్లెట్ ఈసారి కూడా టైటిల్ కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్ స్వర్ణం అనంతరం అతడికి ఇది మరో ముఖ్యమైన టోర్నమెంట్. నీరజ్ 2018లో తొలిసారి దోహా డైమండ్ లీగ్‌లో పాల్గొని 87.43 మీటర్లతో నాలుగో స్థానం పొందాడు. ఈసారి కూడా అత్యుత్తమ ప్రదర్శన కనబరచాలనే పట్టుదలతో ఉన్నాడు.
అయితే, నీరజ్‌కు ఈసారి కూడా గట్టి పోటీ ఎదురుకానుంది. రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్, గ్రెనడాకు చెందిన అండర్సన్ పీటర్స్, చెక్ రిపబ్లిక్కు చెందిన జాకబ్ వాద్లెచ్ వంటి మేటి అథ్లెట్లు బరిలో ఉన్నారు. వీరు గతంలో కూడా దోహాలో మంచి ప్రదర్శనలు కనబరిచారు. భారత్‌కే చెందిన మరో జావెలిన్ త్రోయర్ కిషోర్ జెనా కూడా ఈ పోటీల్లో పాల్గొంటున్నాడు. ఆసియా క్రీడల్లో రజతం సాధించిన జెనా, గత ఏడాది దోహాలో 76.31 మీటర్ల త్రోతో తొమ్మిదో స్థానంలో నిలిచాడు.