Varun Tej: భ‌ర్త వ‌రుణ్‌తేజ్ ఆస‌క్తిక‌ర వీడియో షేర్ చేసిన‌ లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi Shares Adorable Video of Varun Tej Making Pizza
  • ప్రెగ్నెంట్‌గా ఉన్న భార్య కోసం స్వ‌యంగా పిజ్జా త‌యారు చేసిన మెగా ప్రిన్స్ 
  • త‌న కోసం భ‌ర్త ప‌డుతున్న క‌ష్టాన్ని వీడియో తీసి షేర్ చేసిన లావణ్య త్రిపాఠి
  • వీడియో చూసి త‌మ‌దైన‌శైలిలో స్పందిస్తున్న నెటిజ‌న్లు
కొద్ది రోజుల క్రితం వ‌రుణ్ తేజ్‌, లావ‌ణ్య త్రిపాఠి దంప‌తులు తాము త్వ‌ర‌లో త‌ల్లిదండ్రులు కాబోతున్నామంటూ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దాంతో మెగా ఇంటికి వార‌సుడు వ‌స్తాడా, వార‌సురాలు వ‌స్తుందా అని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక‌, ప్రెగ్నెంట్‌గా ఉన్న భార్య కోసం తాజాగా మెగా ప్రిన్స్ స్వ‌యంగా పిజ్జా త‌యారు చేశారు.  

త‌న కోసం భ‌ర్త ప‌డుతున్న క‌ష్టాన్ని వీడియో తీసి లావణ్య త్రిపాఠి షేర్ చేశారు. ఇక వరుణ్ తేజ్ చేసిన ఆ పిజ్జా అయితే చూస్తేనే యమ్మీ అని అనిపిస్తోంది. తన భార్యకు సేవలు చేసే స‌మ‌యం ఇదే అని వరుణ్ తేజ్ ఇలా టేస్టీ టేస్టీ పిజ్జా చేసినట్టుగా కనిపిస్తోంది. భార్య కోసం వ‌రుణ్ తేజ్ చాలానే క‌ష్ట‌ప‌డుతున్నాడ‌ని, ఇంత ప్రేమించే భ‌ర్త దొర‌క‌డం లావ‌ణ్య అదృష్టం అని నెటిజ‌న్లు కామెంట్స్ పెడుతున్నారు. 

వ‌రుణ్ తేజ్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఫిదా, తొలిప్రేమ వంటి వ‌రుస విజ‌యాలతో దూసుకుపోయిన వరుణ్ ఈ మ‌ధ్య వ‌రుస ప‌రాజ‌యాల‌తో డీలాప‌డ్డాడు. అయితే మెగా ఫ్యామిలీలో కొత్త కథల్ని, ప్రయోగాల్ని చేసే హీరోగా వరుణ్ తేజ్‌కు మంచి పేరు ఉంది. ఇప్పుడు మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో వరుణ్ తేజ్ ఓ తెలుగు, కొరియన్ మూవీని చేస్తుండ‌గా, ఇది కామెడీ, థ్రిల్ల‌ర్‌గా ఉండ‌నుంద‌ని స‌మాచారం.

ఇక‌, లావణ్య త్రిపాఠి పెళ్లి తరువాత ఆచి తూచి ప్రాజెక్టులు ఎంచుకుంటున్న విష‌యం తెలిసిందే. పెళ్లి త‌ర్వాత సతీ లీలావతి అనే మూవీని పూర్తి చేశారు. ఇటీవ‌లే ఈ చిత్రం డబ్బింగ్ పనులు కూడా మొద‌ల‌య్యాయి. జూన్‌లో ఈ మూవీని విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. 
Varun Tej
Lavanya Tripathi
Mega Prince
Pregnancy Announcement
Pizza Video
Telugu Cinema
Tollywood
Sati Leelavathi
Upcoming Telugu Movie
Celebrity Couple

More Telugu News