Nirav Modi: లండన్ కోర్టులో నీరవ్ మోదీకి చుక్కెదురు.. 8వ సారి కూడా బెయిల్ తిరస్కరణ

- నీరవ్ మోదీకి బెయిల్ ఇచ్చేందుకు లండన్ కోర్టు నిరాకరణ
- పరారయ్యే అవకాశం ఉందని, సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని కోర్టు ఆందోళన
- 2019 మార్చి నుంచి బ్రిటన్ జైలులోనే నీరవ్
- భారత ప్రభుత్వ తీరుపై నీరవ్ లాయర్ సంచలన ఆరోపణలు
పరారీలో ఉన్న భారతీయ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి మరోసారి నిరాశే ఎదురైంది. ఆయన బెయిల్ పిటిషన్‌ను లండన్‌లోని హైకోర్టు గురువారం తిరస్కరించింది. ఇది ఆయనకు బెయిల్ నిరాకరించడం ఎనిమిదోసారి కావడం గమనార్హం. నీరవ్ మోదీకి బెయిల్ మంజూరు చేస్తే, ఆయన విచారణకు లొంగిపోకుండా పరారయ్యే అవకాశం ఉందని, అలాగే సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని నమ్మడానికి బలమైన ఆధారాలున్నాయని జస్టిస్ ఫోర్డ్హామ్ తన తీర్పులో పేర్కొన్నారు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు (పీఎన్బీ) ఒక బిలియన్ డాలర్లకు పైగా మోసం చేశారన్న ఆరోపణలపై నీరవ్ మోదీని మార్చి 2019లో అప్పగింత వారెంట్‌పై అరెస్టు చేసినప్పటి నుంచి ఆయన బ్రిటన్‌లో జైలు జీవితం గడుపుతున్నారు.
న్యాయవాది వాదనలు, కోర్టు పరిశీలనలు
నీరవ్ మోదీ తరపు న్యాయవాది ఎడ్వర్డ్ ఫిట్జ్‌గెరాల్డ్ కేసీ పలు కీలక అంశాలను కోర్టు దృష్టికి తెచ్చారు. విచారణ ఖైదీగా నీరవ్ మోదీ చాలా ఎక్కువ కాలం జైల్లో ఉన్నారని వాదించారు. ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా అభివర్ణించిన షెట్టితో సహా, భారతదేశంలోని సహ నిందితులందరికీ బెయిల్ లభించిందని ఆయన గుర్తు చేశారు. నీరవ్ మోదీ పరారయ్యే అవకాశం లేదని, ఆయన ఆస్తులన్నీ స్తంభింపజేయడం, జప్తు చేయడం వల్ల పారిపోవడానికి ఆర్థిక వనరులు కూడా లేవని తెలిపారు. సాక్షులను ప్రభావితం చేశారన్న ఆరోపణ ఏడేళ్ల క్రితం జరిగిందని, అప్పటి నుంచి జైలులో ఫోన్ సౌకర్యం ఉన్నప్పటికీ అలాంటి ఘటనలు పునరావృతం కాలేదని ఆయన కోర్టుకు వివరించారు.
భారత ప్రభుత్వానికి భయపడి నీరవ్ మోదీ వేరే దేశానికి వెళ్లినా సురక్షితంగా ఉండలేరని ఫిట్జ్‌గెరాల్డ్ ఆందోళన వ్యక్తం చేశారు. "క్రిస్టియన్ మిషెల్, జగ్తార్ జోహల్, లతీఫా కేసులు, కెనడా, అమెరికాలలో జరిగిన హత్యలు, హత్యా ప్రయత్నాలు భారత ప్రభుత్వ పలుకుబడి ఎంతటిదో స్పష్టం చేస్తున్నాయి. ఆయన వనౌటు వంటి దేశానికి వెళ్లి భారత ప్రభుత్వం నుంచి సురక్షితంగా ఉండగలరనేది పూర్తిగా హాస్యాస్పదం" అని ఆయన వాదించారు. "వారు ఆయన్ను పట్టుకోవడానికి హంతక ముఠాను పంపించవచ్చు, లేదా కిడ్నాప్ చేయవచ్చు, లేదా ఆ దేశ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి భారత్‌కు అప్పగించేలా చేయవచ్చు," అని తీవ్ర ఆరోపణలు చేశారు. మిషెల్‌ను కళ్లకు గంతలు కట్టి, చేతులకు సంకెళ్లు వేసి ప్రైవేట్ జెట్‌లో యూఏఈ నుంచి భారత్‌కు తరలించారని, జోహల్‌ను వీధిలో కిడ్నాప్ చేశారని, లతీఫాను భారత అధికారులు కిడ్నాప్ చేశారని ఫిట్జ్‌గెరాల్డ్ ఆరోపించారు. ఇవి న్యాయవ్యవస్థేతర ప్రతీకార చర్యల ప్రమాదాన్ని మరింత పెంచుతున్నాయని ఆయన అన్నారు.
అయితే, న్యాయమూర్తి ఈ వాదనలను అడ్డుకున్నారు. "భారత ప్రభుత్వానికి నిజంగానే అంత శక్తి ఉంటే, యూకేలో ఎందుకు పట్టుకోలేరు?" అని నీరవ్ మోదీ తరఫు న్యాయవాదిని జస్టిస్ ఫోర్డ్హామ్ ప్రశ్నించారు.
ఏప్రిల్ 2018లో ప్రారంభమైన ఒక రహస్య న్యాయపరమైన విషయం అతడి అప్పగింత ప్రక్రియను ఆలస్యం చేస్తోందని, ఆరేళ్లు జైల్లో ఉండటం చాలా ఎక్కువ అని ఫిట్జ్‌గెరాల్డ్ పేర్కొన్నారు.
భారత ప్రభుత్వం తరపున వాదించిన నికోలస్ హియర్న్, నీరవ్ మోదీకి నిజంగా భారత ప్రభుత్వం నుంచి ప్రాణహాని ఉంటే, ఆయన స్వచ్ఛందంగా భారత్‌కు తిరిగి రావడానికి ఇష్టపడతారా? అని ప్రశ్నించారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం, కోర్టు నీరవ్ మోదీ బెయిల్ అభ్యర్థనను తోసిపుచ్చింది.