ChatGPT: అప్పులు తీర్చడం ఎలా అని అడిగితే చాట్ జీపీటీ ఏంచెప్పిందంటే..?

ChatGPTs Advice on Repaying Debts
––
అప్పు చేసేటపుడు బాగానే ఉంటుంది కానీ తీర్చేటపుడే చుక్కలు కనిపిస్తుంటాయి. అందినకాడల్లా అప్పులు చేసిన ఓ యువకుడు తన అప్పులు తీర్చే మార్గం చెప్పాలంటూ చాట్ జీపీటీని అడిగాడు. ఆర్థిక క్రమశిక్షణతో అప్పులను తీర్చేయవచ్చని, ముందుగా చిన్న అప్పులను తీర్చేస్తూ ఆత్మవిశ్వాసం కూడగట్టుకోవాలని చాట్ జీపీటీ ఆన్సర్ ఇచ్చింది. క్రెడిట్ కార్డులు, ఈఎంఐలు, తెలిసిన వారి దగ్గర తీసుకున్న చేబదులు.. ఇలా మీకున్న అప్పులన్నీ ఓ లిస్ట్ రాసుకోమని సూచించింది. ప్రతీదానికి చెల్లించాల్సిన వడ్డీ, గడువు తేదీ వివరంగా పేపర్ పై పెట్టాలని పేర్కొంది. ఆపై మీకు వచ్చే ఆదాయంతో అప్పులను తీర్చేందుకు ప్లాన్ చేసుకోండి అని సూచించింది.
 
ముందుగా మీకున్న చిన్న అప్పును తీర్చడంపై తొలుత దృష్టి పెట్టాలి. అతి చిన్న అప్పు తీర్చిన తర్వాత.. తదుపరి చిన్న అప్పుకు వెళ్లాలి. ఈ పద్ధతి త్వరిత విజయాలను అందిస్తుంది మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని తెలిపింది. చిన్న చిన్న మొత్తాలు పలువురికి ఇవ్వాల్సి ఉంటే తక్కువ వడ్డీకి పెద్ద మొత్తం తీసుకుని వాటిని చెల్లించడం ఒక పద్దతి. దీనివల్ల వడ్డీ భారం తగ్గుతుందని పేర్కొంది. ఆదాయాన్ని పెంచుకోవడం వల్ల రుణ చెల్లింపు వేగవంతం అవుతుందని, అదనంగా వచ్చే చిన్న ఆదాయం కూడా కాలక్రమేణా గణనీయమైన ప్రభావం చూపుతుందని తెలిపింది. అప్పుల భారం మరీ ఎక్కువైతే నిపుణుల సలహా తీసుకోవడం మంచిదని సూచించింది.
ChatGPT
Debt Management
Financial Advice
Debt Repayment Strategies
Credit Cards
EMIs
Personal Loans
Financial Planning
Debt Consolidation
Financial Literacy

More Telugu News