Hyderabad fire accident: హైదరాబాద్ లో ఘోర అగ్ని ప్రమాదం.. 8 మంది సజీవదహనం.. వీడియో ఇదిగో!

Hyderabad Fire 9 Dead Several Injured in Charminar Tragedy
  • చార్మినార్ సమీపంలోని గుల్జార్‌హౌస్‌లో ఎగిసిపడ్డ మంటలు
  • మంటల్లో చిక్కుకున్న నాలుగు కుటుంబాలు
  • మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు
  • మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందన్న వైద్యులు
హైదరాబాద్ లో ఆదివారం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో నాలుగు కుటుంబాలు భవనంలోనే చిక్కుకుపోయాయి. మంటల తీవ్రతకు ఎనిమిది మంది సజీవదహనమయ్యారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారని సమాచారం. స్థానికుల సమాచారంతో వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది బిల్డింగ్ లో నుంచి పదహారు మందిని కాపాడారు. గాయాలపాలైన వారిని ఆసుపత్రికి తరలించారు.

క్షతగాత్రులలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకున్న వారిలో పదహారు మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. గాయపడిన వారిని ఉస్మానియా, యశోద (మలక్‌పేట), డీఆర్డీవో, అపోలో ఆసుపత్రులకు తరలించారు. విద్యుదాఘాతం వల్లే భవనంలో మంటలు చెలరేగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు.
Hyderabad fire accident
Charminar
Gulzar House fire
Tragic incident
Nine deaths
Fire victims
Rescue operation
Electrical short circuit
Injured
Hospitals

More Telugu News