KL Rahul: కోహ్లీ ఆల్‌టైమ్ టీ20 రికార్డుపై క‌న్నేసిన కేఎల్ రాహుల్‌

KL Rahul Eyes Kohlis T20 Record
  • ఈరోజు అరుణ్ జైట్లీ స్టేడియంలో జీటీ, డీసీ మ్యాచ్‌
  • టీ20ల్లో అత్యంత వేగంగా 8వేల‌ పరుగుల మైలురాయికి చేరువ‌లో రాహుల్‌
  • మ‌రో 13 ప‌రుగులు చేస్తే చాలు
  • ఈ ఫీట్‌ను చేరుకోవ‌డానికి 243 టీ20 ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ
  • రాహుల్ ముందు 214 టీ20 ఇన్నింగ్స్‌లలో ఈ మైలురాయిని సాధించే అవ‌కాశం  
ఈరోజు అరుణ్ జైట్లీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ (జీటీ), ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ మ్యాచ్ ద్వారా డీసీ జట్టు స్టార్ ప్లేయ‌ర్ కేఎల్ రాహుల్ టీ20ల్లో అత్యంత వేగంగా 8వేల‌ పరుగుల మైలురాయిని చేరుకునే అవ‌కాశం ఉంది. త‌ద్వారా ఈ పీట్‌ను సాధించిన‌ భారత బ్యాట‌ర్‌ విరాట్ కోహ్లీ ఆల్‌టైమ్‌ రికార్డును రాహుల్ అధిగ‌మించే ఛాన్స్ ఉంది. 

రాహుల్ ఈ మైలురాయికి ఇంకా 33 పరుగులు దూరంలో ఉన్నాడు. ఒక‌వేళ ఇవాళ్టి మ్యాచ్‌లో ఈ ర‌న్స్ చేస్తే.. కేవలం 214 టీ20 ఇన్నింగ్స్‌లలో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన భారత ఆటగాడిగా నిలుస్తాడు. ఇక‌, విరాట్ ఈ మైలురాయిని చేరుకోవ‌డానికి 243 టీ20 ఇన్నింగ్స్ ఆడాడు.

218 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించిన పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ ఆజామ్‌ను వెనక్కి నెట్టి, పొట్టి ఫార్మాట్‌లో మొత్తం మీద రెండవ ఫాస్టెస్ట్‌ ఆటగాడిగా అవతరించే అవకాశం రాహుల్‌కు ఉంది. కాగా, ఈ జాబితాలో వెస్టిండీస్ స్టార్ ఆట‌గాడు క్రిస్ గేల్ కేవ‌లం 213 ఇన్నింగ్స్‌ల‌లో ఈ ఫీట్‌ను న‌మోదు చేసి, టాప్‌లో ఉన్నాడు. 

గుజరాత్ టైటాన్స్ తమ టాప్ టైర్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌కు వ్యతిరేకంగా ఆడంబరమైన స్టార్‌ను వరుసలో ఉంచడం ద్వారా రాహుల్ పార్టీని చెడగొట్టవచ్చు. ఆఫ్ఘనిస్తాన్ బాల్ ట్వీకర్ రాహుల్‌ను ఇతరుల మాదిరిగా కాకుండా అడ్డుకున్నాడు. 47 బంతుల్లో, రాహుల్ కేవలం 40 పరుగులు మాత్రమే చేయగలిగాడు, ఈ ప్రక్రియలో మూడుసార్లు వికెట్ కోల్పోయాడు.

కాగా, ఢిల్లీ క్యాపిటల్స్ కు ఇవాళ్టి మ్యాచ్ అత్యంత కీల‌కం. ఈరోజు జీటీపై గెలిస్తేనే ప్లేఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవంగా ఉంటాయి. ఓడితే మాత్రం ప్లేఆఫ్స్ అవ‌కాశాలు మ‌రింత సంక్లిష్టంగా మారుతాయి. ఇప్ప‌టివ‌ర‌కు డీసీ 11 మ్యాచులాడి 6 విజ‌యాల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో ఆరో స్థానంలో ఉంది. మరోవైపు గుజ‌రాత్ టైటాన్స్ 11 మ్యాచ్‌ల్లో 8 విజ‌యాల‌తో దాదాపు ప్లేఆఫ్స్‌కు చేరువైంది. ఇవాళ గెలిస్తే ప్లేఆఫ్స్ బెర్త్ ఖ‌రారు చేసుకున్న తొలి జ‌ట్టుగా అవ‌త‌రిస్తుంది.  


KL Rahul
Virat Kohli
T20 Record
Delhi Capitals
Gujarat Titans
IPL 2023
Fastest 8000 Runs
Cricket
Babur Azam
Chris Gayle

More Telugu News