Harbhajan Singh: క్రికెటర్ల అభిమానులపై భజ్జీ సంచలన వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో దుమారం

Dhonis Fan Base vs Others Harbhajan Singhs Comments Create a Stir
  • ఎంఎస్ డీకి మాత్రమే నిజమైన అభిమానులు ఉన్నారన్న హర్భజన్
  • మిగతా ఆటగాళ్లకు ఉన్నది పెయిడ్ ఆర్మీనేనని విమర్శ
  • హర్భజన్ పై మండిపడుతున్న కోహ్లీ ఫ్యాన్స్
క్రికెటర్ల అభిమానులపై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఎంఎస్ ధోనీ ఫ్యాన్ బేస్‌ గురించి మాట్లాడుతూ.. ధోనీకి మాత్రమే అసలైన అభిమానులు ఉన్నారని, మిగతా క్రికెటర్ల అభిమానుల్లో చాలామంది సోషల్ మీడియా ఫ్యాన్స్ లేదా డబ్బులిచ్చి నడిపించేవారని హర్భజన్ వ్యాఖ్యానించారు.

ఆర్సీబీ, కేకేఆర్ మ్యాచ్ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో హర్భజన్ ఈ వ్యాఖ్యలు చేశారు. "ధోనీ ఎంతకాలం ఆడాలనుకుంటే అంతకాలం ఆడొచ్చు. అభిమానులు కూడా అతను ఆడాలనే కోరుకుంటారు. నా అభిప్రాయం ప్రకారం, అతనికి మాత్రమే నిజమైన ఫ్యాన్ బేస్ ఉంది. మిగతా వాళ్లందరూ సోషల్ మీడియాలో కనిపించేవాళ్లే, అందులోనూ కొందరు పెయిడ్ ఫ్యాన్స్ కూడా ఉంటారు. వారి గురించి చర్చించడం అనవసరం" అని హర్భజన్ పేర్కొన్నారు.

హర్భజన్ ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు, అదే ప్యానెల్‌లో ఉన్న మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా నవ్వుతూ "ఇంత నిజం చెప్పకూడదు భజ్జీ" అని అన్నారు. దానికి హర్భజన్ "ఎవరో ఒకరు చెప్పాలి కదా" అని బదులిచ్చారు. అయితే, హర్భజన్ వ్యాఖ్యలు విరాట్ కోహ్లీ అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. తమ అభిమాన ఆటగాడిని కించపరిచేలా భజ్జీ మాట్లాడారని వారు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.
Harbhajan Singh
MS Dhoni
Virat Kohli
Cricket Fans
Social Media
Paid Fans
Star Sports
Controversial Comments
RCB vs KKR
Indian Cricket

More Telugu News