Jagan Mohan Reddy: తిరుపతిలో దళిత విద్యార్థి జేమ్స్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను: జగన్

Jagan Condemns Dalit Student Attack in Tirupati
  • క్షీణించిన శాంతిభద్రతలకు ఈ ఘటనే నిదర్శనమన్న జగన్
  • రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోయాయని ఆందోళన
  • పోలీసులపై అధికార పార్టీ నేతల తీవ్ర ఒత్తిడి: జగన్ ఆరోపణ
  • ఫిర్యాదుదారులపైనే ఎదురు కేసులు బనాయిస్తున్నారన్న జగన్
  • దాడి ఘటన నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్
తిరుపతిలో ఇంజినీరింగ్ విద్యార్థి జేమ్స్‌పై జరిగిన దాడిని వైసీపీ అధినేత జగన్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, దళితులు, బలహీన వర్గాలపై దాడులు నిత్యకృత్యంగా మారాయని మండిపడ్డారు. ఈ మేరకు సోషల్ మీడియాలో స్పందించారు. 

"తిరుపతిలో ఇంజినీరింగ్‌ దళిత విద్యార్థి జేమ్స్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతి భద్రతలకు, దళితులపై తీవ్రమవుతున్న దాడులకు ఈ ఘటన ఒక ఉదాహరణ. దళితులు, తమ గొంతు గట్టిగా వినిపించలేని వర్గాల వారికి ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది. చంద్రబాబు, అధికారపార్టీ నాయకుల డైరెక్షన్‌లో కక్ష సాధింపు చర్యల్లో మునిగితేలుతున్న పోలీసు యంత్రాంగం పౌరులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతను పూర్తిగా విస్మరించడంవల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. 

ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట దళితులపైన దాడులు  జరుగుతూనే ఉన్నాయి. పోలీస్‌స్టేషన్లకు వెళితే న్యాయం జరుగుతుందన్న నమ్మకం పోవడమేకాదు, ఫిర్యాదుదారులమీదే ఎదురు కేసులు పెట్టడం పరిపాటిగా మారింది. జేమ్స్‌పై దాడి ఘటనలో పోలీసు యంత్రాంగం వైఫల్యమే కాదు, రాజకీయ జోక్యంతో కనీసం ఫిర్యాదునుకూడా స్వీకరించలేని పరిస్థితి. తిరుపతి ఘటనకు కారకులైన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాను" అంటూ జగన్ ట్వీట్ చేశారు.

Jagan Mohan Reddy
Tirupati Attack
Dalit Student Attack
Andhra Pradesh
Law and Order
Police Failure
Chandrababu Naidu
YCP
Engineering Student
James

More Telugu News