Chandrababu Naidu: చంద్రబాబుకు గిఫ్ట్ ఇచ్చిన పూనమ్ కౌర్

- హైదరాబాదులో తెలుగు వన్ డిజిటల్ మీడియా వజ్రోత్సవం
- హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు
- చంద్రబాబుకు కానుక అందించి మురిసిపోయిన పూనమ్ కౌర్
హైదరాబాదులో జరిగిన తెలుగు వన్ డిజిటల్ మీడియా సంస్థ వజ్రోత్సవ వేడుకల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ నటి పూనమ్ కౌర్ సీఎం చంద్రబాబుకు ఓ విశిష్ట కానుక అందించారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అమరావతి స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఓ పటచిత్ర ఆర్ట్ వర్క్ ను ఆయనకు బహూకరించినట్టు ఆమె తెలిపారు. ఈ మేరకు ఫొటోను కూడా పంచుకున్నారు. సోషల్ మీడియాలో ఆమె పోస్టుకు అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.