Supreetha: సినీ నటి సురేఖ వాణి కూతురు, హీరోయిన్ సుప్రీతకు తీవ్ర అనారోగ్యం

Supreetha Daughter of Sureshvani Suffers from Severe Illness
  • ఆసుపత్రి బెడ్‌పై ఉన్న ఫొటో షేర్ చేసిన సుప్రీత
  • గత వారం నుంచి తనకు బాగా దిష్టి తగిలిందని వెల్లడి
  • శివయ్యకు తనపై కోపం వచ్చిందని వ్యాఖ్య
టాలీవుడ్ నటి, సురేఖ వాణి కుమార్తెగా గుర్తింపు పొందిన సుప్రీత అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆసుపత్రి బెడ్‌పై ఉన్న ఒక ఫొటోను షేర్ చేస్తూ, తనకు దిష్టి తగిలిందని పేర్కొన్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సుప్రీత తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో, "నేను శివయ్యను మాత్రమే నమ్ముతాను. అలాంటి శివయ్యకు నా మీద కోపం వచ్చినట్టుంది. అయినా శివయ్య, అమ్మ, రమణ లేకుండా నేను ఉండలేను. వారు ఉండగా నాకేం కాదు. నాకు గత వారం నుంచి బాగా దిష్టి తగిలింది. త్వరగానే కోలుకుంటాను" అంటూ రాసుకొచ్చారు. సుప్రీత చేసిన ఈ వ్యాఖ్యలపై ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

మొదట్లో తల్లి సురేఖ వాణితో కలిసి రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పాప్యులారిటీ సంపాదించుకున్న సుప్రీత, ఆ తర్వాత తన గ్లామరస్ ఫొటోలతో ఫాలోయింగ్‌ను మరింత పెంచుకున్నారు. ప్రస్తుతం ఆమె రెండు చిన్న బడ్జెట్ సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు సమాచారం. బుల్లితెరపై కూడా కొన్ని షోలలో కనిపిస్తూ సందడి చేస్తున్నారు. సుప్రీత త్వరగా కోలుకుని మళ్లీ యాక్టివ్ అవ్వాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.
Supreetha
Supritha Actress
Supritha Illness
Supritha Health Update
Sureshvani Daughter
Tollywood Actress
Telugu Actress
Social Media Post
Viral Post

More Telugu News