Anasuya Bharadwaj: నూతన గృహప్రవేశం చేసిన అనసూయ

Anasuya Bharadwajs New Home A Spiritual Housewarming
  • నూతన గృహ ప్రవేశ ఫోటోలను షేర్ చేసిన నటి అనసూయ 
  • తనకు ఎదురైన ఆధ్యాత్మిక అనుభూతిని పంచుకున్న అనసూయ 
  • తమ ఇంటికి హనుమాన్ జీ వచ్చాడంటూ భావోద్వేగానికి గురైన వైనం
ప్రముఖ సినీ నటి, యాంకర్ అనసూయ ఇటీవల నూతన గృహాన్ని కొనుగోలు చేశారు. తన కుటుంబ సభ్యులతో కలిసి గృహ ప్రవేశ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తాజాగా తనకు ఎదురైన ఆధ్యాత్మిక అనుభూతిని అనసూయ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. తన కొత్త ఇంటికి 'శ్రీరామ సంజీవి' అని పేరు పెట్టినట్లు తెలిపారు. గృహ ప్రవేశం రోజున తమ ఇంటికి ఆంజనేయస్వామి విచ్చేశారంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు.

నూతన గృహ ప్రవేశం సందర్భంగా కొన్ని హోమాలు, పూజలు, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, మరకత లింగ రుద్రాభిషేకం జరిపినట్లు ఆమె వివరించారు. హనుమంతుడు తమను ఆశీర్వదించడానికి వచ్చారని పేర్కొన్నారు. అందరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండకపోవచ్చని తనకు తెలుసునని, కానీ తనకు ఎదురైన అనుభూతిని అందరితో పంచుకోవాలనిపించిందని ఆమె అన్నారు. కొందరు నమ్మినా, నమ్మకపోయినా ప్రహ్లాదుడు చెప్పినట్లు 'అందు గలడు, ఇందు లేడని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందే గలడు' అంటూ అనసూయ తన భావోద్వేగాలను వ్యక్తం చేస్తూ ఫోటోలను షేర్ చేశారు. 

.
Anasuya Bharadwaj
Anasuya new house
Anasuya housewarming
Tollywood actress
Spiritual experience
Hanuman
Sri Rama Sanjeevi
Housewarming ceremony
Social media
Viral photos

More Telugu News