Lara Loomer: బైడెన్ రెండు నెలల్లోనే చనిపోవచ్చు: ట్రంప్ మద్దతుదారు లారా లూమర్

- జో బైడెన్ కు ప్రోస్టేట్ క్యాన్సర్ నిర్ధారణ
- ప్రాణాంతక వ్యాధితో బైడెన్ బాధపడుతున్నారని ఏడాది క్రితమే చెప్పానన్న లారా
- ప్రాణాంతకం అంటే ఎంతో కాలం పట్టదని వ్యాఖ్య
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ప్రోస్టేట్ క్యాన్సర్తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్త వెలువడిన వెంటనే, రైట్-వింగ్ కార్యకర్త, ట్రంప్ మద్దతుదారు లారా లూమర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కలకలం రేపారు. బైడెన్ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నారని తాను గతంలోనే చెప్పానని, ప్రస్తుత నిర్ధారణ తన వాదనను బలపరుస్తోందని ఆమె పేర్కొన్నారు.
లారా లూమర్ ఎక్స్ వేదికగా పలు సంచలన ట్వీట్లు చేశారు. "చాలా మంది నాకు క్షమాపణ చెప్పాలి. బైడెన్ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నారని గత జులైలోనే మీకందరికీ చెప్పాను. ప్రాణాంతకం అంటే ఆరు నెలల నుంచి ఏడాదిలోపు... ఎంతో కాలం పట్టదు" అని లూమర్ పేర్కొన్నారు. బైడెన్ వచ్చే రెండు నెలల్లోనే చనిపోవచ్చని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.