Real Engineering: వీడియోలో భారత మ్యాప్ తారుమారు.. యూట్యూబ్ ఛానెల్‌పై తీవ్ర ఆగ్రహం!

Real Engineering YouTube Channel Faces Ire Over Distorted India Map
  • ఇస్రో విజయాలపై 'రియల్ ఇంజినీరింగ్' యూట్యూబ్ ఛానెల్ వీడియో
  • వీడియోలో భారత దేశ పటాన్ని తప్పుగా చూపించడంతో వివాదం
  • భారతీయుల నుంచి తీవ్ర వ్యతిరేకత, ఛానెల్‌పై విమర్శల వెల్లువ
  • తాము చూపింది అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన మ్యాపేనన్న ఛానెల్ నిర్వాహకులు
  • "భారత్‌ను పొగిడి తప్పుచేశా" అంటూ యూట్యూబర్ వివాదాస్పద వ్యాఖ్యలు
  • సరిహద్దుల విషయంలో సున్నితత్వం పాటించాలన్న అభిప్రాయాలు
ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ 'రియల్ ఇంజినీరింగ్' భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) విజయాలపై ప్రశంసలతో ఒక వీడియోను విడుదల చేసింది. అయితే, 'ది అన్‌లైక్లీ రైజ్ ఆఫ్ ది ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్' పేరుతో వచ్చిన ఈ వీడియోలో భారతదేశ పటాన్ని తప్పుగా చూపించడం తీవ్ర వివాదానికి దారితీసింది. దేశంలోని కొన్ని కీలక భూభాగాలను మినహాయించి చిత్రీకరించిన ఈ మ్యాప్‌పై భారతీయ వీక్షకుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమయింది. ఇది దేశ ప్రాదేశిక సమగ్రతను అగౌరవపరిచే చర్యగా వారు ఆరోపించారు.

భారతీయుల నుంచి వ్యతిరేకత రావడంతో, 'రియల్ ఇంజినీరింగ్' ఛానెల్ నిర్వాహకులు స్పందిస్తూ, తాము చూపించిన మ్యాప్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందినదేనని, భౌగోళిక రాజకీయ వివాదాలను పరిష్కరించడం తమ బాధ్యత కాదని వాదించారు. అంతేకాకుండా, "ఇకపై భారత్‌ను ప్రశంసిస్తూ తప్పు చేయను" అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం వివాదాన్ని మరింత తీవ్రతరం చేసింది. ఒక వీక్షకుడి ప్రశ్నకు బదులిస్తూ, "సరిహద్దు వివాదాల వల్ల కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి తెలుస్తుంది, ఇవేవీ ముఖ్యం కాదని. సరిహద్దులనేవి కేవలం ఊహించుకున్నవే. ప్రజలు సురక్షితంగా ఉండటమే ముఖ్యం" అని ఛానెల్ నిర్వాహకులు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలు సరిహద్దుల్లో ప్రాణత్యాగం చేసిన సైనికులను, పౌరులను అవమానించేలా ఉన్నాయని భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు.


Real Engineering
ISRO
Indian Space Program
India Map
Geopolitical Dispute
Territorial Integrity
YouTube Channel Controversy
Indian Viewers
Border Disputes
India

More Telugu News