Vishal: ట్విస్టులపై ట్విస్టులు ఇస్తున్న విశాల్!

Vishal Special
  • హీరోగా 20 ఏళ్లకి పైగా ప్రయాణం 
  • మాస్ యాక్షన్ హీరోగా గుర్తింపు 
  • ఇటీవల ఆయన ఆరోగ్య పరిస్థితిపై ప్రచారాలు 
  • సాయి ధన్సికతో కలిసి నడవనున్న విశాల్  

విశాల్ .. ఈ పేరుకు తెలుగు - తమిళ భాషల్లో ఓ క్రేజ్ ఉంది. తమిళంలో మాస్ హీరోల మార్కెట్ ఎక్కువ కాలం ఉంటుంది. అందువలన బరిలోకి దిగిన దగ్గర నుంచి మాస్ ఇమేజ్ మూటగట్టడం కోసమే అక్కడి హీరోలంతా ప్రయత్నిస్తూ ఉంటారు. చాలామంది మాస్ హీరోలు తమ జోరు చూపిస్తూ ఉండగానే, విశాల్ మాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తనదైన మార్క్ ను చూపిస్తూ ఎదగడానికి ఆయన ఎక్కువ సమయం తీసుకోలేదు. యాక్షన్ హీరోగా ఆయనకంటూ ఒక స్థానం ఉంది. 

హీరోగా ఇరవైయేళ్లకి పైగా ప్రయాణం చేస్తూ వస్తున్న విశాల్, తమిళంతో పాటు తన సినిమాలు తెలుగులోనూ విడుదలయ్యేలా చేస్తూ వచ్చాడు. అందువలన విశాల్ కి ఇక్కడ కూడా అభిమానుల సంఖ్య ఎక్కువగానే ఉంది. కొన్ని వివాదాలు .. మరికొన్ని సహాయాలు విశాల్ ఖాతాలో మనకి కనిపిస్తూ ఉంటాయి. అలాంటి విశాల్ కి కొంతకాలంగా సరైన హిట్ లేదు. అయినా ఈ మధ్య ఆయన గురించి చాలామంది మాట్లాడుకున్నారు. అందుకు కారణం .. ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలనే చెప్పాలి. 

ఆ మధ్య ఒక ఈవెంట్ కి వెళ్లిన విశాల్, చేతులు వణుకుతూ కనిపించాడు. తల పైకెత్తి చూడలేని పరిస్థితి.. మాట్లాడలేని స్థితి. ఆ విషయంపై చాలామంది ఆర్టిస్టులు క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేశారు. కొన్ని రోజులకే విశాల్ చాలా యాక్టివ్ గా కనిపించడంతో,  స్టేజ్ పై ఆ రోజున ఆయన చేసింది యాక్టింగ్ అంటూ తిట్టిన వాళ్లూ లేకపోలేదు. రీసెంటుగా మరోసారి విశాల్ కుప్పకూలిపోవడం కూడా హాట్ టాపిక్ గా మారింది. ఆయన కాస్త కేర్ తీసుకోవాలంటూ అభిమానులు సోషల్ మీడియాలో హడావిడి చేశారు. 

మొత్తానికి విశాల్ ఏదో అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడని చాలామంది ఇంకా అనుకుంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాను సాయిధన్సికను వివాహం చేసుకోనున్నట్టు ప్రకటించి షాక్ ఇచ్చాడు విశాల్. తమది ప్రేమ వివాహమే అవుతుందనీ .. ఆగస్టులో జరుగుతుందని తేల్చిపారేశాడు కూడా. లవ్ మేటర్ ఇప్పటివరకూ బయటికి రాకుండా విశాల్ మేనేజ్ చేసిన తీరుకు అంతా ఆశ్చర్యపోతున్నారు. సినిమాలలో మాత్రమే కాదు, నిజ జీవితంలోను విశాల్ ట్విస్టులపై ట్విస్టులు ఇవ్వడం గురించే ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. 


Vishal
Vishal marriage
Vishal Sai Dhansika
Tamil actor
Telugu movies
Vishal health issues
Vishal career
Vishal love affair
Kollywood news
Vishal upcoming movies

More Telugu News