Rajasthan Royals: ఐపీఎల్ లో నామమాత్రపు మ్యాచ్.. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్

- ఇప్పటికే టోర్నీ నుంచి ఎలిమినేట్ అయిన చెన్నై, రాజస్థాన్
- నేడు ఢిల్లీలో మ్యాచ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్
ఐపీఎల్-2025లో ప్లే ఆఫ్స్ లో ఆడే జట్లు ఖరారైన నేపథ్యంలో, నేడు ఏమంత ప్రాధాన్యం లేని మ్యాచ్ జరుగుతోంది. టోర్నీ నుంచి ఎప్పుడో ఎలిమినేట్ అయిన రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు నేడు నామమాత్రపు మ్యాచ్ లో ఆడుతున్నాయి. ఈ మ్యాచ్ కు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ఆఫ్ బెర్తులను ఖరారు చేసుకున్నాయి. నాలుగో బెర్తు కోసం ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య పోరు నెలకొంది.
