Rana Naidu 2: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'రానా నాయుడు 2'... స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

Venkatesh Rana Daggubati Rana Naidu 2 Netflix Release Date
  • ‘రానా నాయుడు’ సీజన్ 2 తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వెంకటేష్, రానా
  • 2023లో నెట్‌ఫ్లిక్స్‌లో భారీ విజయం సాధించిన తొలి సీజన్
  • జూన్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో రెండో సీజన్ స్ట్రీమింగ్
ప్రముఖ నటులు విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి కలిసి నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఈ సిరీస్ రెండో సీజన్ జూన్ 13 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. మొదటి సీజన్ అనూహ్య విజయం సాధించడంతో, రెండో సీజన్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

2023లో నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో విడుదలైన ‘రానా నాయుడు’ మొదటి సీజన్, వీక్షకుల నుంచి విశేష స్పందన అందుకుంది. ఈ సిరీస్ బ్రేక్అవుట్ హిట్‌గా నిలవడంతో, నిర్వాహకులు రెండో సీజన్‌ను మరింత ఉత్కంఠభరితంగా, ఆసక్తికరమైన కథాంశంతో తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ప్రేక్షకులను ఆకట్టుకునేలా సరికొత్త హంగులతో సీజన్ 2 రూపుదిద్దుకుంది.

‘రానా నాయుడు’ సిరీస్‌ ను సుందర్ ఆరోన్, లోకోమోటివ్ గ్లోబల్ సంస్థలు దీనిని నిర్మించాయి. కరణ్ అన్షుమాన్‌తో పాటు సుపర్న్ ఎస్. వర్మ, అభయ్ చోప్రాలు దర్శకత్వ బాధ్యతలు పంచుకున్నారు.

సీజన్ 2లో కూడా వెంకటేష్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించగా వారితో పాటు అర్జున్ రాంపాల్, సుర్వీన్ చావ్లా, కృతి ఖర్బందా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, డినో మోరియా వంటి ప్రముఖ తారాగణం కూడా ఈ సిరీస్‌లో భాగం అయ్యారు. ఈ స్టార్ కాస్టింగ్ తో రెండో సీజన్ మరింత ఆకర్షణీయంగా ఉండబోతోందని చిత్ర యూనిట్ వర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాది జూన్‌లో నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ ఉత్కంఠభరిత సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.
Rana Naidu 2
Rana Daggubati
Venkatesh Daggubati
Netflix India
Rana Naidu Season 2
Indian web series
Arjun Rampal
Surveen Chawla
OTT platform
Telugu cinema

More Telugu News