Satyapriya: సిల్క్ స్మిత అలా చేస్తుందని అనుకోలేదు: నటి సత్యప్రియ

Sathya Priya Interview
  • పెళ్లికి ముందు 50కి పైగా సినిమాలు చేశాను
  • రీ ఎంట్రీ తరువాత 'బాషా' పడటం కలిసొచ్చింది 
  • సంతృప్తితో బ్రతకడమే నాకు అలవాటు 
  • సిల్క్ స్మిత మరణం కదిలించిందని వెల్లడి

సత్యప్రియ .. నటిగా అనేక సినిమాలలో కీలకమైన పాత్రలను పోషించారు. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. తాజాగా ఆమె 'పాప్ కార్న్' అనే యూ ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను ప్రస్తావించారు. " నా అసలు పేరు సత్యవతి .. రచయిత వీటూరిగారు 'సత్యప్రియ' గా మార్చారు. పెళ్లికి ముందు నేను 50కి పైగా సినిమాలు చేశాను. వివాహమైన తరువాత 8 ఏళ్లు గ్యాప్ తీసుకున్నాను" అని చెప్పారు. 

" రీ ఎంట్రీ లో నేను చేసిన పాత్రలు నాకు మంచి మంచి పేరు తెచ్చిపెట్టాయి. 'బాషా' సినిమా తరువాత ఇక నేను వెనుదిరిగి చూసుకోలేదు. 1995లో పిల్లలు ఇద్దరూ 16 - 10 ఏళ్ల వయసులో ఉండగానే మా వారు చనిపోయారు. అప్పటి నుంచి వాళ్లను మరింత శ్రద్ధగా చూసుకుంటూ ప్రయోజకులను చేశాను. అందుకు కారణం ఆర్థికపరమైన ప్లానింగ్ అనే చెబుతాను. ఉన్నదాంట్లో సర్దుకుపోవడం నాకు మొదటి నుంచి అలవాటు" అని అన్నారు. 

" నేను .. సిల్క్ స్మిత కలిసి ఒక మలయాళం సినిమా చేశాము. ఆ సమయంలో తనకి హై ఫీవర్ వస్తే నేనే దగ్గరుండి చూసుకున్నాను.  ఆ సినిమా నుంచి మా మధ్య మరింత సాన్నిహిత్యం పెరిగింది. అక్కడి నుంచి తిరిగివచ్చిన కొన్ని రోజులకు ఆమె చనిపోవడం నేను తట్టుకోలేకపోయాను. నిజంగా తను చాలా మంచిది. కుర్రాళ్ల కలల రాణిగా ఉన్న సిల్క్ స్మితకు, చనిపోయిన తరువాత మిగిలింది కూడా అవమానమే. అదే నాకు ఇప్పటికీ బాధను కలిగిస్తూ ఉంటుంది" అని అన్నారు. 

Satyapriya
Silk Smitha
Telugu Actress
Popcorn Interview
Basha Movie
Tollywood
South Indian Cinema
Satyavathi
Vetoori

More Telugu News