Vishnuvardhan Reddy: రాహుల్ గాంధీ పూల దొంగ: వీడియో పంచుకున్న విష్ణువర్ధన్ రెడ్డి

Vishnuvardhan Reddy calls Rahul Gandhi a flower thief
  • తండ్రి సమాధి వద్ద పూలు జేబులో వేసుకున్న రాహుల్ గాంధీ
  • గాంధీల కుటుంబానికి దొంగతనం చేయడం సహజ లక్షణమని విష్ణు ఘాటు విమర్శ
  • రాహుల్ తన పాత రికార్డును తానే తిరగరాసుకున్నారని ఎద్దేవా
  • కొందరి అలవాట్లు ఎప్పటికీ మారవంటూ చురకలు
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. కొన్ని విషయాలు ఎప్పటికీ మారవని, దొంగతనం చేయడం గాంధీల నైజమని, వారి పాత అలవాట్లు మరోసారి బయటపడ్డాయని ఆయన దుయ్యబట్టారు. 

ఇవాళ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలో రాహుల్ గాంధీ, ఇతర గాంధీ కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. అయితే, రాజీవ్ సమాధి వద్ద ఉన్న పూలను తీసుకుని రాహుల్ గాంధీ తన జేబులో పెట్టుకోవడం తాలూకు వీడియోను విష్ణువర్ధన్ రెడ్డి సోషల్ మీడియాలో పంచుకున్నారు.

"కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు...  వీళ్లంతే స్వభావరీత్యా దొంగలు, గాంధీల అలవాట్లు మళ్ళీ బయటపడ్డాయి. ఈసారి రాహుల్ గాంధీ ఏకంగా ఒక సమాధి నుంచే పువ్వులు దొంగిలించి తన రికార్డును తానే బద్దలు కొట్టారు. ఇది వాళ్ళ క్లాసిక్ స్టైల్!" అంటూ విష్ణువర్ధన్ రెడ్డి ట్వీట్ చేశారు.
Vishnuvardhan Reddy
Rahul Gandhi
Andhra Pradesh BJP
Rajiv Gandhi
Flower theft
Congress
Delhi
Vishnuvardhan Reddy comments
Gandhi family
Political criticism

More Telugu News