Pendulum Movie: వేరేవారి కలలోకి వెళ్లడం తెలిస్తే? .. ఓటీటీలో 'పెండులం' మూవీ!

Pendulum Movie Update
  • మలయాళంలో రూపొందిన 'పెండులం'
  • డిఫరెంట్ కాన్సెప్ట్ ను టచ్ చేసిన సినిమా 
  • ప్రధాన పాత్రల్లో విజయ్ బాబు - అనుమోల్ 
  • ఈ నెల 22వ తేదీ నుంచి ఈటీవీ విన్ లో  

ఒకరి శరీరాన్ని మరొకరి ఆత్మ ఆవహించడం .. ప్రాణం లేని ఒకరి శరీరంలోకి మరొకరి ఆత్మ ప్రవేశించడం .. టైమ్ ట్రావెల్ ద్వారా ఈ కాలంలో నుంచి మరొక కాలంలోకి ప్రయాణించడం వంటి కథలతో సినిమాలు వస్తూనే ఉన్నాయి. కొత్తగా .. ఆసక్తికరంగా అనిపించే కంటెంట్ ను ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. అయితే ఉద్దేశ పూర్వకంగా వేరేవారి కలలోకి వెళ్లడం అనే కాన్సెప్ట్ తో మన దగ్గర మాత్రం సినిమాలు రాలేదు. 

కలలు రావడం సహజం. మన కలలోకి వేరే వారు రావడం సహజంగా జరుగుతూనే ఉంటుంది. అయితే ఉద్దేశ పూర్వకంగా అవతలవారి కలలోకి వెళ్లడం .. ఇతరులను తమ కలలోకి ఆహ్వానించడం  తెలిస్తే ఎలా ఉంటుంది? అలాంటి ఒక అవకాశం ఎలాంటి పరిణామాలకు కారణం అవుతుంది?  అనే కథతో రూపొందిన సినిమానే 'పెండులం'. లూసిడ్ డ్రీమింగ్ - టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో నిర్మితమైన ఈ మలయాళ సినిమాకి రెజిన్ బాబు దర్శకత్వం వహించాడు.   

విజయ్ బాబు - అనుమోల్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, రెండేళ్ల క్రితమే థియేటర్లకు వచ్చింది. అలాంటి ఈ సినిమా ఈ నెల 22వ తేదీ నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది. మహేశ్ నారాయణ్ అనే డాక్టర్ ఫ్యామిలీతో కలిసి సరదాగా ఒక ట్రిప్ వేస్తాడు. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ తరువాత ఏమౌతుంది? అనేది కథ.

Pendulum Movie
Vijay Babu
Anumol
ETV Win
Malayalam Movie
Lucid Dreaming
Time Travel
Regin Babu
Mahesh Narayan

More Telugu News