Sai Dhansika: సాయిధన్సికపై టి.రాజేందర్ మండిపడటం మళ్లీ లైన్ మీదికొచ్చిందే!

Sai Dhansika Special
  • విశాల్ తో ప్రేమలో పడిన సాయిధన్సిక
  • ఆగస్టు 29న జరగనున్న వివాహం 
  • గతంలో సాయిధన్సికను తిట్టిన టి.రాజేందర్
  • ఈ నేపథ్యంలో మళ్లీ వెలుగులోకి వచ్చిన వీడియో క్లిప్
    
కొన్ని సంఘటనలు కొన్ని రోజుల పాటు తమ ప్రభావం చూపించి ఆ తరువాత మరుగున పడిపోతూ ఉంటాయి. అయితే సందర్భాన్ని బట్టి ఆ సంఘటనలు మళ్లీ వెలుగులోకి వస్తుంటాయి. ఆ సంఘటనలు జరిగినప్పటికంటే, మళ్లీ అవి రీ ఎంట్రీ ఇచ్చినప్పుడే ఎక్కువ హడావిడి చేస్తూ ఉంటాయి. అలాంటి వాటి జాబితాలోకి, గతంలో సాయిధన్సికను టి. రాజేందర్ తిట్టిన సంఘటన  కూడా చేరిపోయింది. తనకి అవమానం జరిగిందంటూ ఆయన సాయిధన్సికను అవమానించిన వీడియో కూడా వైరల్ అవుతోంది. 

2017లో సాయిధన్సిక నటించిన 'విళితీరు' ప్రమోషన్స్ లో ఒక సంఘటన జరిగింది. ఆ సినిమాలో టి.రాజేందర్ ఒక కీలకమైన పాత్రను పోషించారు. అయితే ఆ సినిమా ప్రెస్ మీట్ లో అందరికీ ధన్యవాదాలు తెలియజేసిన ధన్సిక, పొరపాటున టి. రాజేందర్ పేరును ప్రస్తావించడం మరిచిపోయింది. దాంతో ఆయన ఒక రేంజ్ లో ఆమెపై మండిపడ్డాడు. రజనీ లాంటి స్టార్స్ తో కలిసి పనిచేయడం వలన, తనలాంటివారు ఆమెకి కనిపించడం లేదని ఎద్దేవా చేశాడు. చిన్నా పెద్దా .. నాగరికత తెలుసుకోవాలని కాస్త గట్టిగానే మాట్లాడాడు. 

అయితే అప్పటికే ఆయనను కూల్ చేయడానికి సాయిధన్సిక చేయవలసిన ప్రయత్నాలన్నీ చేసింది. సారీ చెప్పిన ప్రతిసారీ టి. రాజేందర్ మరింత డోస్ పెంచుతూ వెళ్లాడు. అక్కడివాళ్లలో ఎవరూ ఆమెను సపోర్ట్ చేయకపోవడం చూసినవారికి 'అయ్యో పాపం' అనే అనిపించింది. అయితే ఆ సంఘటనపై కాస్త గట్టిగానే స్పందించిన హీరో, ఆమెకి మద్దతుగా నిలబడిన హీరో... విశాల్.  అప్పటి నుంచే వాళ్ల స్నేహం బలపడుతూ వచ్చిందని టాక్. ఆగస్టు 29న వీరి వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన ఆ సంఘటన గురించి మళ్లీ ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు.

Sai Dhansika
T Rajendar
Vishal
Tamil cinema
Kollywood
Vilithiru
Sai Dhansika controversy
Vishal marriage
Tamil film industry
Press meet

More Telugu News