Pawan Kalyan: వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్ .. మన ఊరు - మాటా మంతి

Pawan Kalyan Launches Innovative Program Mana Ooru Mata Manti
  • మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రావివలస గ్రామస్తులతో మాట్లాడిన పవన్ కల్యాణ్ 
  • మన ఊరు - మాటా మంతిలో పవన్‌కు సమస్యలు విన్నవించిన గ్రామస్తులు
  • అభివృద్ధి పనుల గురించి గ్రామస్తులను అడిగి తెలుసుకున్న పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకునేందుకు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన సినీ నేపథ్యానికి తగ్గట్టుగానే, వెండితెరను వేదికగా చేసుకుని ఆయన ప్రజలతో సంభాషించడం విశేషం. ఈ రకమైన కార్యక్రమం దేశంలోనే మొదటిదని చెబుతున్నారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం నాడు అమరావతిలోని మంగళగిరిలో ఉన్న తన అధికారిక నివాసం నుంచి శ్రీకాకుళం జిల్లా ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. ‘మన ఊరు-మాట మంతి’ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని ఒక సినిమా థియేటర్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. టెక్కలి మండలం రావివలస గ్రామానికి చెందిన ప్రజలు థియేటర్‌లో కూర్చుని తమ సమస్యలను పవన్ కళ్యాణ్‌కు నేరుగా వివరించారు.

ఈ సందర్భంగా, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల పురోగతి గురించి పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. గ్రామస్థులు లేవనెత్తిన పలు సమస్యలను సావధానంగా విన్న ఆయన, వాటి తక్షణ పరిష్కారానికి అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే.
Pawan Kalyan
Mana Ooru Mata Manti
Andhra Pradesh
Tekkali
Ravivalasa
Public Grievance Redressal
Deputy Chief Minister
Panchayat Raj
Rural Development
AP News

More Telugu News