Sai Dhansika: నా లైఫ్ లో మరిచిపోలేని సంఘటన అది: హీరోయిన్ సాయి ధన్సిక 

Sai Dhansika Interview
  • 'కబాలి'లో ఛాన్స్ రావడం నా అదృష్టం 
  • రజనీ సార్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను 
  • ఆ రోజు జరిగిన అవమానం మరిచిపోలేనిది 
  • ఆ బాధ నుంచి కోలుకోవడానికి వారం పట్టిందన్న సాయి ధన్సిక

కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా సాయిధన్సిక పేరు ఎక్కువగా వినిపిస్తోంది. త్వరలో ఆమె విశాల్ తో కలిసి పెళ్లి పీటలు ఎక్కనున్నారు. తాజాగా ఆమె 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక విషయాలను పంచుకున్నారు. 'కబాలి' సినిమా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అందుకు కారకులు రజనీ సార్ .. రంజిత్ సార్ అనే చెబుతాను. నేను చాలా సెన్సిటివ్ గా ఉండేదానిని. కానీ రజనీ సార్ తో కలిసి పనిచేశాక, జీవితం అంటే ఏమిటి? అనేది అర్థమైంది" అని అన్నారు. 

" ఏ రంగంలో ఏ పని చేయడానికి వెళ్లినా అక్కడ కొన్ని అవమానాలు ఎవరికైనా ఎదురవుతూనే ఉంటాయి. అవమానాలు మనకు పాఠాలు నేర్పుతూ వెళతాయి. ఇకపై ఎలా ఉండాలనేది తెలిసేలా చేస్తాయి. అలాంటి ఒక అవమానమే నాకూ జరిగింది. నేను చేసిన ఓ తమిళ సినిమా, కాస్త ఆలస్యంగా రిలీజ్ కి వచ్చింది. ప్రమోషన్స్ కి రమ్మని దర్శకుడు రిక్వెస్ట్ చేయడంతో వెళ్లాను. అప్పుడు నాకు హెల్త్ బాగోలేదు. రెండు మాటలు మాట్లాడేసి త్వరగా వెళ్లిపోతానని కూడా డైరెక్టర్ కి చెప్పాను" అని అన్నారు. 

" హెల్త్ బాగోలేకపోవడం వలన .. నేను ఆ ప్రెస్ మీట్ పై ఫోకస్ చేయలేకపోయాను. నా వలన చిన్న పొరపాటు జరిగింది. అందుకు నేను రాజేందర్ గారికి 'సారీ' కూడా చెప్పాను. కానీ ఆయన వినిపించుకోలేదు. ఈ విషయంపై ఇండస్ట్రీలో చాలామంది నన్ను సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. కానీ ఆ బాధ నుంచి నేను బయటికి రావడానికి వారం రోజలు పట్టింది. నా జీవితంలో నేను మరిచిపోలేని సంఘటన ఏదైనా ఉందంటే అది ఇదేనని చెప్పాలి. నేను చాలా పీస్ ఫుల్ గా ఉండాలని అనుకుంటున్నాను. అందువలన ఈ విషయంపై ఇంకా మాట్లాడలేను" అని చెప్పారు. 

Sai Dhansika
Vishal
Sai Dhansika wedding
Kabali movie
Rajinikanth
Ranjith
Tamil cinema
actress interview
Suman TV interview
movie promotions

More Telugu News