Malavika Mohanan: ప్రభాస్‌పై మాళవిక మోహనన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

Malavika Mohanan Interesting Comments On Prabhas
  • ఇటీవల సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన బ్యూటీ
  • ఈ క్ర‌మంలో ప్రభాస్‌తో తన అనుభవాలను పంచుకున్న మాళ‌విక‌
  • డార్లింగ్‌ చుట్టూ ఎప్పుడూ బోరింగ్ క్షణమే ఉండదన్న మాళ‌విక‌  
  • ప్ర‌భాస్‌ చుట్టూ ఎప్పుడూ బోరింగ్ క్షణమే ఉండద‌ని వ్యాఖ్య 
రెబ‌ల్ స్టార్‌ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ది రాజా సాబ్’. ఇందులో మాళవిక మోహనన్ ఒక హీరోయిన్‌గా నటిస్తున్నారు. అలాగే మ‌రో క‌థానాయిక‌గా నిధి అగ‌ర్వాల్ చేస్తున్నారు. అయితే, ఈ మూవీ షూటింగ్ అనుభవాలను పంచుకుంటూ, ప్రభాస్ గురించి మాళవిక తాజాగా ఆస‌క్తిక‌ర‌ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ సామాజిక మాధ్య‌మాల్లో వైరల్ అవుతున్నాయి.

మాళవిక మోహనన్ ఇటీవల సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించారు. ఈ క్ర‌మంలో ప్రభాస్‌తో తన అనుభవాలను ఆమె పంచుకున్నారు. "నేను ప్రభాస్ సార్‌ను కలవడానికి ముందు ఆయన ఇంటర్వ్యూలు చూసినప్పుడు చాలా సైలెంట్‌గా, రిజర్వ్‌డ్‌గా ఉంటారని అనుకున్నా. కానీ, అనుకున్నంత సైలెంట్ కాదు అని ఆ త‌ర్వాత తెలుసుకున్నా. ఆయనను స్వయంగా కలిసినప్పుడు మంచి మాటకారి, సూపర్ ఫన్, ఫన్నీ అని అర్థమైంది. 

ఆయ‌న‌తో సమయం గడపడానికి చాలా చక్కని వ్యక్తులలో ఒకరని తెలుసుకున్నా. డార్లింగ్‌ చుట్టూ ఎప్పుడూ బోరింగ్ క్షణమే ఉండదు" అని మాళవిక చెప్పుకొచ్చారు. ఇక‌, గ‌తంలో కూడా ప్ర‌భాస్‌ను ఆమె ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తిన విష‌యం తెలిసిందే. ప్రభాస్ తన సహనటులను సెట్‌లో ఆహారంతో ఆకట్టుకుంటారని, ఒక గ్రామానికి సరిపడా రుచికరమైన భోజనాన్ని ఏర్పాటు చేస్తారని మాళవిక అన్నారు. ఇటీవల విడుదలైన ‘కల్కి 2898 ఏఈడీ’ సినిమా విజయం తర్వాత కూడా ప్రభాస్ చాలా సింపుల్‌గా, డౌన్ టు ఎర్త్ గా ఉన్నారని ఆమె కొనియాడారు.
Malavika Mohanan
Prabhas
The Raja Saab
Nidhi Agarwal
Maruthi movie
Kalki 2898 AD
Telugu cinema
Tollywood
Prabhas interview
Prabhas fans

More Telugu News