YS Jagan Mohan Reddy: జగన్ కు సీఎం రమేశ్ సవాల్

- లిక్కర్ స్కామ్‌పై సీఎం రమేశ్ సంచలన వ్యాఖ్యలు
- నిరూపిస్తే జగన్ రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని సవాల్
- అమరావతికి ప్రపంచస్థాయి గుర్తింపు ఖాయమన్న ఎంపీ
లిక్కర్ స్కామ్ వ్యవహారంపై అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ స్కామ్‌కు సంబంధించి అన్ని విషయాలు తనకు తెలుసని, ఒకవేళ తాను ఆరోపణలు నిరూపిస్తే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటారా? అంటూ ఆయన సవాల్ విసిరారు.
లిక్కర్ దోపిడీకి సంబంధించిన పూర్తి సమాచారం తన వద్ద ఉందని స్పష్టం చేశారు. విద్యుత్ కొనుగోళ్ల అంశంలో కూడా తాను దేనికైనా సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఇదే సమయంలో అమరావతి అభివృద్ధి గురించి ప్రస్తావిస్తూ, గత ప్రభుత్వం రాజధానుల పేరుతో సమయాన్ని వృధా చేసిందని విమర్శించారు. "అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్యాలయాలు ఇప్పుడు అమరావతిలో కొలువుదీరనున్నాయి. అతి త్వరలోనే అమరావతికి ప్రపంచ స్థాయి గుర్తింపు రావడం ఖాయం. ఇక్కడ భూముల విలువ కూడా గణనీయంగా పెరుగుతోంది. పెట్టుబడులు వస్తున్నాయి, యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగవుతున్నాయి" అని ఆయన వివరించారు.
కాగా, కొద్ది రోజుల క్రితం లిక్కర్ స్కామ్‌పై మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. లిక్కర్ స్కామ్ పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అక్రమ అరెస్టులతో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు.