GV Babu: 'బ‌ల‌గం' న‌టుడు జీవీ బాబు క‌న్నుమూత‌

Balagam actor GV Babu passes away
  • గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జీవీ బాబు
  • వరంగల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతి
  • జీవీ బాబు మృతి పట్ల బ‌లగం ద‌ర్శ‌కుడు వేణు విచారం
ప్రముఖ రంగ‌స్థ‌ల‌ కళాకారుడు, 'బలగం' సినిమా నటుడు జీవీ బాబు కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయ‌న అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో వరంగల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందారు. జీవీ బాబు మృతి పట్ల బ‌లగం ద‌ర్శ‌కుడు వేణు విచారం వ్య‌క్తం చేశారు. 

జీవీ బాబు మ‌ర‌ణం ప‌ట్ల సంతాపం తెలిపారు. ఆయ‌న‌ మొత్తం జీవితం నాటకరంగంలోనే గడిపార‌ని, జీవీ బాబును బలగం సినిమా ద్వారా తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు పరిచయం చేసే భాగ్యం తనకు దక్కిందని వేణు అన్నారు. ఇక‌, బాబు మృతి గురించి తెలుసుకున్న సినీ ప్ర‌ముఖులు సంతాపం తెలుపుతున్నారు. 

కాగా, రెండేళ్ల క్రితం విడుదలైన ‘బలగం’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విష‌యం తెలిసిందే. ఇందులో భాగమైన నటీనటులందరికీ మంచి పేరు వచ్చింది. చాలా మందికి మంచి సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. కాగా, ఇదే బలగం సినిమాలో ప్రియదర్శికి చిన్నతాత అంజన్నగా అద్భతంగా నటించారు జీవీ బాబు. కథని ముందుకు తీసుకోవడంలో ఆయనదే కీలక పాత్ర. మన పల్లెటూర్లలో తాతలు ఎలా ఉంటారో అచ్చం అలాగే ఎంతో సహజంగా నటించి జీవీ బాబు మెప్పించారు. అలాంటి నటుడు మృతిచెంద‌డంతో ఇండ‌స్ట్రీలో విషాదం నెల‌కొంది.
GV Babu
Balagam movie
Balagam actor
Telugu cinema
Venu Yeldandi
Warangal
Theater artist
Telugu film industry

More Telugu News