Gandhi Hospital: గాంధీ ఆసుపత్రిలో కొవిడ్ వార్డ్

Gandhi Hospital Sets Up Covid Ward Amid Rising Cases
  • 60 బెడ్లతో ఏర్పాటు చేసిన అధికారులు
  • పలు రాష్ట్రాల్లో కొవిడ్ కలకలం నేపథ్యంలో ముందుజాగ్రత్త
  • పదిమంది వైద్య నిపుణులతో కమిటీ ఏర్పాటు
దేశంలో కొవిడ్ వ్యాప్తి మరోమారు పెరుగుతుండడం, నగరంలో ఓ వైద్యుడికి తొలి కేసు నమోదు కావడంతో గాంధీ ఆసుపత్రి అధికారులు అప్రమత్తమయ్యారు. కొవిడ్ బాధితుల కోసం ప్రత్యేకంగా వార్డులు ఏర్పాటు చేశారు. మొత్తం 60 పడకలతో వార్డులు ఏర్పాటు చేసి, బాధితులకు చికిత్స అందించడానికి, కొవిడ్ వ్యాప్తి కట్టడికి పదిమంది వైద్య నిపుణులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వెలుగు చూస్తున్న కేసులు ప్రమాదకరమైనవి కావని, ప్రజలు జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని వైద్యులు తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని వివరించారు.

ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి చైర్మన్ గా ఏర్పాటైన ఈ కమిటీ కొవిడ్ కేసులు పెరిగితే రోగులకు అందించే అత్యవసర వైద్యం, వసతులపై ఎప్పటికప్పుడు సమావేశమై నిర్ణయాలు తీసుకుంటుందని డాక్టర్ కె.సునీల్ తెలిపారు. కొవిడ్ బాధితుల కోసం 3 ప్రత్యేక వార్డులు, అందులో 60 పడకలను సిద్ధం చేసినట్లు డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ కె.సునీల్ తెలిపారు. ఇందులో అత్యవసర వైద్య వసతులు కలిగిన 15 పడకలతో ప్రత్యేక వార్డును సిద్ధం చేసినట్లు వెల్లడించారు. వెంటిలేటర్లతో కూడిన ఐసీయూ వార్డులు కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. కేసులు పెరిగినట్లయితే వైరస్ వేరియంట్ ను గుర్తించేందుకు నమూనాలను వైరాలజీ ల్యాబ్ కు పంపిస్తామని వివరించారు.
Gandhi Hospital
Covid ward
Covid cases India
Dr Rajakumari
Dr Sunil
Coronavirus treatment
Hyderabad hospitals
Covid protocols
Virus variant
ICU beds

More Telugu News