MS Dhoni: గుజరాత్ టైటాన్స్ తో సీఎస్కే పోరు... ధోనీకి ఇదే చివరి మ్యాచా?

MS Dhonis Last IPL Match CSK vs Gujarat Titans
  • ఐపీఎల్ లో నేడు డబుల్ హెడర్
  • తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ తో తలపడున్న సీఎస్కే
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై టీమ్
  • ఇరు జట్లకు లీగ్ దశలో ఇదే చివరి మ్యాచ్
ఐపీఎల్ లో నేడు డబుల్ హెడర్ (రెండు మ్యాచ్ లు) నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమయ్యే తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన సీఎస్కే బ్యాటింగ్ ఎంచుకుంది. లీగ్ దశలో ఇరు జట్లకు ఇదే చివరి మ్యాచ్. గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే ప్లే ఆఫ్ దశ చేరుకుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే పాయింట్ల పట్టికలో టాపర్ గా క్వాలిఫయర్-1 మ్యాచ్ ఆడుతోంది. 

ఇక, సీఎస్కే జట్టు పాయింట్ల పట్టికలో అన్ని జట్ల కంటే అట్టడుగున ఉంది. ఇప్పటిదాకా 13 మ్యాచ్ లు ఆడిన ఆ జట్టు కేవలం 3 విజయాలు మాత్రమే సాధించి ఈ సీజన్ లో దారుణంగా ఫెయిలైంది. సీజన్ మధ్యలోనే రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయంతో తప్పుకోవడంతో, మహేంద్ర సింగ్ ధోనీయే జట్టును నడిపిస్తున్నాడు. 

కాగా, ధోనీకి ఐపీఎల్ లో ఇదే చివరి మ్యాచ్ అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మోకాలి సర్జరీ నుంచి ధోనీ ఇంకా పూర్తిగా కోలుకోలేదన్న విషయం అతడి బ్యాటింగ్ స్థానమే చెబుతోంది. ధోనీ బ్యాటింగ్ ఆర్డర్ లో బాగా దిగువన వస్తున్నాడు. వచ్చే సీజన్ కు చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ లో భారీగా మార్పులు ఉండే అవకాశముందని క్రికెట్ పండితులు భావిస్తున్నారు.
MS Dhoni
Chennai Super Kings
Gujarat Titans
IPL 2024
Ruturaj Gaikwad
IPL Playoff
Cricket
CSK vs GT
IPL Points Table

More Telugu News