Sunrisers Hyderabad: చివరి మ్యాచ్... సన్ రైజర్స్ గెలుపుతో ముగించేనా?

Sunrisers Hyderabad Aim for Victory in Final Match
  • ముగింపు దశకు చేరిన ఐపీఎల్ లీగ్ స్టేజ్
  • కేకేఆర్ తో సన్ రైజర్స్ ఢీ
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్
ఈ సీజన్ లో ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ప్లే ఆఫ్ దశకు చేరుకోవడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో, సన్ రైజర్స్ ఇవాళ తన చివరి లీగ్ మ్యాచ్ ను కోల్ కతా నైట్ రైడర్స్ టీమ్ తో ఆడుతోంది. ఈ మ్యాచ్ కు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక. టాస్ గెలిచిన సన్ రైజర్స్ సారథి ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఐపీఎల్ పునఃప్రారంభం అయ్యాక సన్ రైజర్స్ వరుసగా రెండు మ్యాచ్ ల్లో నెగ్గి అభిమానులను అలరించింది. ఇవాళ కేకేఆర్ తో మ్యాచ్ లోనూ నెగ్గి సీజన్ ను విజయంతో ముగించాలని సన్ రైజర్స్ ఆశిస్తోంది.

గెలుపుతో సీజన్ ముగించిన చెన్నై సూపర్ కింగ్స్

ఇవాళ డబుల్ హెడర్ తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆల్ రౌండ్ షో కనబర్చింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో చెన్నై జట్టు 83 పరుగుల భారీ తేడాతో గుజరాత్ టైటాన్స్ ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సీఎస్కే జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాట్స్ మెన్ అదరగొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 230 పరుగులు చేసింది. అనంతరం, 231 పరుగుల లక్ష్యఛేదనలో గుజరాత్ టైటాన్స్ 18.3 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో ఓపెనర్ సాయి సుదర్శన్ 41 పరుగులు చేయగా, చివర్లో అర్షద్ ఖాన్ 20 పరుగులు చేశాడు. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ 3, అన్షుల్ కాంభోజ్ 3, రవీంద్ర జడేజా 2, ఖలీల్ అహ్మద్ 1, మతీశ పతిరణ 1 వికెట్ తీశారు.
Sunrisers Hyderabad
SRH
Kolkata Knight Riders
KKR
IPL 2024
Pat Cummins
Arun Jaitley Stadium
Chennai Super Kings
CSK
Gujarat Titans

More Telugu News