NTR: మహానాడుకు రమ్మంటూ అన్నగారి పిలుపు.. వీడియో ఇదిగో!

NTR Calls for Mahanadu Attendance AI Video Goes Viral
--
తెలుగుదేశం పార్టీ తలపెట్టిన మహానాడు కార్యక్రమానికి తరలిరావాలంటూ అన్న ఎన్టీఆర్ పిలుపునిచ్చారు. ఏఐ సాంకేతికతతో టీడీపీ ఈ వీడియోను సృష్టించి ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఈ నెల 27 నుంచి 29 వరకు కడపలో టీడీపీ మహానాడు కార్యక్రమం జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావాలంటూ తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం పిలుపునిచ్చింది. ఈ పోస్టులో ఏఐ ద్వారా నందమూరి తారకరామారావు మాట్లాడినట్లు వీడియో సృష్టించారు.

‘ప్రియమైన నా తెలుగింటి ఆడపడుచులకు, అన్నదమ్ములకు నమస్కారం. తెలుగుజాతిని ఏకం చేయడానికి, తెలుగువారిని జాగృతం చేయడానికి నేను ప్రారంభించిన మహానాడు నేడు తెలుగువారి ఐక్యతకు చిహ్నంగా నిలవడం నాకు ఎంతో గర్వంగా ఉంది. 2025 మే 27, 28, 29 తేదీలలో కడప గడ్డపై తొలిసారిగా జరగబోయే మహానాడు వేడుకలకు మీ అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను.. ’ అంటూ ఈ వీడియో సాగింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియో కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతోంది.
NTR
Nandamuri Taraka Rama Rao
TDP Mahanadu
Telugu Desam Party
Kadapa
Andhra Pradesh Politics
AI Video
Telugu People
2025 Mahanadu

More Telugu News