Smeha Manimegalai: అందమైన ఆ కళ్లకు అంతా అభిమానులైపోతున్నారే!

Smeha Manimeghalai Special
  • 'ఆఫీస్' సిరీస్ తో దక్కిన గుర్తింపు 
  • చురుకైన కళ్లతో పెరుగుతున్న క్రేజ్
  • సిరీస్ కి ప్రధానమైన ఆకర్షణగా నిలిచిన బ్యూటీ 
  • సినిమాలలోను రాణించే ఛాన్స్  

అందం గురించి మాట్లాడుకోవాలంటే ఎవరైనా సరే ముందుగా కళ్లను గురించే ప్రస్తావిస్తారు. అందానికి నిర్వచనం కళ్లతోనే మొదలవుతుంది. విశాలమైన కళ్లను విప్పార్చే యువతులకు గల ఆకర్షణ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. కోల కళ్లతో .. వాలు చూపులతో వెండితెరపై విన్యాసాలు చేసిన భామలు ఎంతోమంది ఉన్నారు. కేవలం కళ్లే ప్రధానమైన ఆకర్షణగా చేసుకుని హీరోయిన్స్ గా వెలిగిన బ్యూటీలు ఉన్నారు. 

అంతటి ఆకర్షణీయమైన కళ్లు మళ్లీ ఇప్పుడు ఇంతకాలానికి తారసపడ్డాయని కుర్రాళ్లు చెప్పుకుంటున్నారు. అంతగా చురుకైన కళ్లతో .. పదునైన చూపులతో కుర్రాళ్ల మనసులను దోచుకుంటున్న ఆ సుందరి పేరే 'స్మేహా మణిమేఘలై'. ఆ కోర కళ్లు చేసే విశేషాలు చూడాలంటే, 'ఆఫీస్' వెబ్ సిరీస్ చూడవలసిందే. జియో హాట్ స్టార్ లో 56 ఎపిసోడ్స్ తో ఈ సిరీస్ తెలుగులోనూ అందుబాటులో ఉంది. " స్మేహా మణిమేఘలై ఈ సిరీస్ లో 'ఇందు' పాత్రలో కనిపిస్తుంది. తరచూ 'పారి' పట్ల చిటపటలాడే ఇందూ పాత్రలో ఆమె నటన అందరినీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా స్మేహా కళ్లు .. అవి చెప్పే కబుర్లకు చాలామంది కుర్రాళ్లు అభిమానులైపోయారు. ఆమెకి వరుస అవకాశాలు తెచ్చిపెడుతున్నవి కూడా ఆమె కళ్లేనని చెప్పాలి. ఈ సిరీస్ కి ఆమెనే ప్రధానమైన ఆకర్షణ అని ఒప్పుకోవాలి. 

స్మేహా 2001లో చెన్నైలో జన్మించింది. గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసిన ఈ బ్యూటీ, ఆ తరువాత మోడలింగ్ వైపు వెళ్లింది. 'కానా కానుమ్ కాలంగళ్' అనే సిరీస్ తో పాటు, 'ఆఫీస్' సిరీస్ ఆమెకి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. కాస్త ఒళ్లు చేస్తే హీరోయిన్ గా స్మేహా రాణించే అవకాశం ఉందని అభిమానులు అంటున్నారు. చూద్దాం చురుకైన కళ్లతో ఈ సుందరి ఎంతవరకూ చుట్టబెడుతుందో. 
Smeha Manimegalai
Smeha Manimegalai actress
Office web series
Indu character
Tamil actress
Chennai actress
Telugu web series
Indian actress
actress with beautiful eyes
Kana Kanum Kalangal

More Telugu News