Vamsee: 'అన్వేషణ' విషయంలో ఆ ముగ్గురికి డౌట్ వచ్చింది: వంశీ

Vamsi Interview
  • 1985లో వచ్చిన 'అన్వేషణ'
  • ప్రధానమైన బలంగా నిలిచిన సంగీతం 
  • 40 ఏళ్లు పూర్తిచేసుకున్న సినిమా 
  • ఆర్టిస్టుల అనుమానాలపై స్పందించిన వంశీ 

వంశీ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమాలలో 'అన్వేషణ' ఒకటి. కామినేని ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా, 1985లో థియేటర్లకు వచ్చింది. కార్తీక్ - భానుప్రియ జంటగా నటించిన ఈ సినిమా, 40 ఏళ్లను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమాను గురించి వంశీ మాట్లాడుతూ .. 'సితార' సినిమాలో నాకు మంచి పాత్ర ఇచ్చారు. ఈ సినిమాలో విలన్ ను చేశారు .. అసలే హీరోగా కూడా చేస్తున్నాను .. నా పాత్రను కొంచెం సాఫ్ట్ చేయండి అని శరత్ బాబు అడిగేవారు" అని అన్నారు. 

"ఇక ఒక రోజున కైకల సత్యనారాయణ గారికి ఒక సీన్ చెబుతుంటే, ఆయనను నన్ను దగ్గరికి పిలిచారు. "ఆనాటి నుంచి ఈనాటి వరకూ నేను ఎన్ని వందల సినిమాలు చేసుంటాను? అలాంటి నాకు నీ టెక్నిక్ అర్థం కావడం లేదు. అసలు ఈ సినిమాలో నేను కమెడియన్ నా? .. పెద్దమనిషినా ?.. హంతకుడినా? అని అడిగారు. 'జనాలకు అనుమానం రావడం కోసమే మిమ్మల్ని పెట్టుకున్నాం సార్' అంటూ ఆయనను కన్వీన్స్ చేశాను" అని చెప్పారు. 

"ఈ కథలో సస్పెన్స్ .. యాక్షన్ నాపై నడుస్తుందని ఈ సినిమాను ఒప్పుకున్నాను గానీ, హీరోయిన్ పైనని ఇప్పుడు అర్థమైంది" అని  అంటూ కార్తీక్ డేట్స్ విషయంలో కాస్త ఇబ్బంది పెట్టాడు. దాంతో తలకోనలో చేయవలసిన ఒక సాంగ్ ను మద్రాస్ శివారులోని ఓ మామిడి తోటలో తీయవలసి వచ్చింది. ఈ సినిమా రిలీజ్ సమయంలో రిజల్ట్ ఎలా ఉందో తెలుసుకోవడం కోసం నేను మాత్రం చాలా టెన్షన్ పడిపోయాను" అని అన్నారు. 

Vamsee
Anveshana movie
Karthik
Bhanupriya
Kammineni Prasad
Kaikala Satyanarayana
Sarath Babu
Telugu cinema
suspense thriller
1985 movies

More Telugu News