Tirumala: మరోసారి కలకలం... తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో చిరుత సంచారం

- వినాయకుడి ఆలయం సమీపంలో భక్తులకు కనిపించిన చిరుత
- ఫోటోలు, వీడియోలు తీసిన భక్తులు
- భక్తుల సమాచారంతో అక్కడికి చేరుకొని చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టిన అటవీ శాఖ అధికారులు
- భయాందోళనలకు గురైన భక్తులు
తిరుమలలో చిరుత సంచారం మరోసారి భక్తుల్లో భయాందోళనలు రేకెత్తించింది. మొదటి ఘాట్ రోడ్డులో, రక్షణ గోడపై వినాయకుడి ఆలయం సమీపంలో చిరుత సంచరించడాన్ని కొందరు భక్తులు గుర్తించి ఫోటోలు, వీడియోలు తీశారు.
సమాచారం అందిన వెంటనే టీటీడీ సిబ్బంది, అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భక్తులను అప్రమత్తం చేశారు. సోమవారం ఉదయం అలిపిరి కాలినడక మార్గంలో చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించిన భక్తులు టీటీడీ అధికారులకు తెలియజేశారు.