Chandrababu Naidu: అంగరంగ వైభవంగా ప్రారంభమైన మహానాడు... రిజిస్ట్రేషన్ చేయించుకున్న చంద్రబాబు

Chandrababu Naidu Inaugurates Mahanadu with Grandeur
  • కడపలో ప్రారంభమైన టీడీపీ మహానాడు
  • రాష్ట్ర నలుమూలల నుంచి తరలి వచ్చిన టీడీపీ నేతలు, కార్యకర్తలు
  • 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత జరుగుతున్న తొలి మహానాడు 
తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మహానాడు సందర్భంగా కడప పసుపుమయంగా మారింది. మహానాడు ప్రాంగణంలో పార్టీ అధినేత చంద్రబాబు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను వీక్షించారు. అనంతరం వేదికపైకి వచ్చారు. వేదికపై ఉన్న పార్టీ కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చంద్రబాబుకు నమస్కరించారు. అనంతరం వేదికపై చంద్రబాబు జ్యోతి ప్రజ్వలన చేశారు. 'మా తెలుగుతల్లికి మల్లెపూదండ' పాటతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత జరుగుతున్న తొలి మహానాడు ఇది. మహానాడుకు రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఈరోజున మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగం ఉంటుంది. పార్టీ సిద్ధాంతాలు, ఆరు సూత్రాల ఆవిష్కరణ, నియమావళి సవరణలపై చర్చ జరుగుతుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
Chandrababu Naidu
Mahanadu
TDP
Telugu Desam Party
Andhra Pradesh Politics
2024 Elections
Party Meeting
Political Event
Kadapa

More Telugu News