Alla Ramakrishna Reddy: వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్కేపై సీఐడీ కేసు నమోదు

CID Files Case Against Former YSRCP MLA Alla Ramakrishna Reddy
  • మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసు
  • ఆర్కేను 127వ నిందితుడిగా చేర్చిన సీఐడీ
  • ఇప్పటికే ఈ కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్
మంగళగిరి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) పై ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. 2021లో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి ఈ కేసు నమోదైంది. ఈ దాడి కేసులో ఆయన్ను 127వ నిందితుడిగా సీఐడీ పోలీసులు చేర్చారు.

వివరాల్లోకి వెళితే, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో, 2021 అక్టోబర్ 19న మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. అయితే, రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత, ఈ దాడి కేసును కూటమి ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఈ కేసు విచారణను సీఐడీ వేగవంతం చేసింది. ఈ కేసులో ఇప్పటికే వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్ అయ్యారు.
Alla Ramakrishna Reddy
Alla Ramakrishna Reddy CID Case
Mangalagiri
TDP Office Attack
Andhra Pradesh CID
Nandigam Suresh
YSRCP
Telugu Desam Party
AP Politics

More Telugu News