Nani: మంచిని పంచే సినిమాలు మనకు కావాలి.. 'టూరిస్ట్ ఫ్యామిలీ'పై నాని ప్రశంసల జల్లు

- శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ
- అభిషాన్ జీవింత్ దర్శకత్వం
- ఇప్పటికే ఈ చిత్రాన్ని మెచ్చుకున్న రజనీకాంత్, శివకార్తికేయన్, రాజమౌళి, సూర్య
- తాజాగా మూవీని ప్రశంసిస్తూ నేచురల్ స్టార్ 'ఎక్స్' వేదికగా పోస్టు
- మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్‌గా నిలిచిన 'టూరిస్ట్ ఫ్యామిలీ'
ఇటీవల తమిళంలో చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్‌ను సొంతం చేసుకున్న మూవీ 'టూరిస్ట్ ఫ్యామిలీ'. శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రల్లో నటించగా.. యోగి బాబు, మిథున్ జై శంకర్, కమలేశ్ జగన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. అభిషాన్ జీవింత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు, పలువురు సెలబ్రిటీలు చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు.
సూపర్ స్టార్ రజనీకాంత్, నటుడు శివకార్తికేయన్ ఈ సినిమా చూసి చిత్రబృందాన్ని ప్రత్యేకంగా పిలిపించుకుని అభినందించారు. అలాగే దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, నటుడు సూర్య కూడా మూవీని మెచ్చుకున్నారు. తాజాగా నేచురల్ స్టార్ నాని సైతం 'టూరిస్ట్ ఫ్యామిలీ' చిత్రంపై ప్రశంసల జల్లు కురిపించారు.
ఈ మేరకు ఆయన 'ఎక్స్' వేదికగా ప్రత్యేకంగా పోస్టు పెట్టారు. "సింపుల్‌గా ఉండి, హృదయపూర్వకంగా.. ఎంతో మంచిని పంచే సినిమాలు మనకు కావాలి. 'టూరిస్ట్ ఫ్యామిలీ' అలాంటి చిత్రమే. ఈ అద్భుతమైన సినిమాను రూపొందించిన నటీనటులకు, చిత్రబృందానికి ధన్యవాదాలు. ఇది చాలా అవసరం" అంటూ నాని రాసుకోచ్చాడు.
టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా స్టోరీ ఇదే..!
శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం కారణంగా ఒక తమిళ కుటుంబం తమ స్వస్థలాన్ని విడిచిపెట్టి భారతదేశానికి శరణార్థులుగా వస్తారు. అనంతరం వారు చెన్నైలో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ప్రయత్నిస్తారు. కానీ వాళ్లు ఎవరు అనేది చెప్పకుండా దాచిపెట్టాల్సి వస్తుంది.
అలా దాచిపెడుతూ ఉండగా అనుకోకుండా రామేశ్వరం దగ్గర ఒక బాంబ్ బ్లాస్ట్ సంఘటన జరుగుతుంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేయడం మొదలుపెడతారు. అయితే, ఈ కేసుకి వీరికి సంబంధంమేంటి? శ్రీలంక నుంచి వచ్చిన ఈ ఫ్యామిలీకి ఎదురైన సమస్యలేమిటి? అనేది ఈ సినిమా స్టోరీ.