Virat Kohli: రికార్డుల రారాజు.. ఒకే మ్యాచ్‌లో మూడు రికార్డులు సాధించిన కోహ్లీ

- నిన్న లక్నో వేదికగా ఆర్‌సీబీ, ఎల్ఎస్‌జీ మ్యాచ్
- లక్నోను ఓడించి క్వాలిఫయర్-1కి అర్హత సాధించిన బెంగళూరు
- 30 బంతుల్లో 54 పరుగులు చేసిన కోహ్లీ ఖాతాలో మూడు రికార్డులు
- ఐపీఎల్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు(63)
- ఐపీఎల్‌లో 9వేల రన్స్ చేసిన తొలి ఆటగాడిగా కోహ్లీ
- ఐపీఎల్‌లో ఐదుసార్లు 600 ప్లస్ రన్స్ చేసిన తొలి బ్యాటర్
ఐపీఎల్ లీగ్ స్టేజ్ చివరి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ)ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) చిత్తు చేసింది. దీంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లిన బెంగళూరు.. క్వాలిఫయర్-1లో ఈ నెల 29న పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్)తో తలపడనుంది. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు వెళ్తుంది.
మరోవైపు ఆర్‌సీబీ గెలుపుతో పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానానికి పడిపోయిన గుజరాత్ టైటాన్స్ (జీటీ) ఈ నెల 30న ముంబయి ఇండియన్స్ (ఎంఐ)తో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనుంది. ఇందులో ఓడిన జట్టు ఇంటిముఖం పడుతుంది. గెలిచిన జట్టు క్వాలిఫర్-1లో ఓడిన టీమ్‌తో క్వాలిఫయర్-2 ఆడనుంది.
కింగ్ కోహ్లీ ఖాతాలో మూడు రికార్డులు
ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఆర్‌సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ నిన్నటి మ్యాచ్‌లోనూ అద్భుతంగా రాణించాడు. 30 బంతుల్లో 54 పరుగులు చేసిన విరాట్ ఏకంగా మూడు రికార్డులు సాధించడం విశేషం. లక్నోపై సాధించిన ఈ హాఫ్ సెంచరీ విరాట్‌కు ఐపీఎల్‌లో 63వ అర్ధ శతకం. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక హాఫ్ సెంచరీలు బాదిన బ్యాటర్‌గా రికార్డుకెక్కాడు. డేవిడ్ వార్నర్ (62)ను అధిగమించి ఈ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
అలాగే ఆర్‌సీబీ తరఫున 9వేల పరుగుల మైలురాయిని కూడా దాటాడు. ఐపీఎల్‌లో 9 వేల పరుగులు చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఆర్‌సీబీకి ఆడుతున్న విరాట్ ఇప్పటివరకు 271 ఇన్సింగ్స్‌లో 9,030 పరుగులు చేశాడు. ఇందులో 14 ఛాంపియన్స్ లీగ్ టీ20ల్లో 424 పరుగులు చేయగా.. ఐపీఎల్‌లో 257 ఇన్నింగ్స్‌ల్లో 8,606 రన్స్ చేశాడు. ఇక, ముంబయి తరఫున రోహిత్ శర్మ 6,060 పరుగులు చేశాడు.
పురుషుల టీ20ల్లో ఒక జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లు..
9030 - విరాట్ కోహ్లీ (ఆర్‌సీబీ)
6060 - రోహిత్ శర్మ (ఎంఐ)
5934 - జేమ్స్ విన్స్ (హాంప్‌షైర్)
5528 - సురేశ్ రైనా (సీఎస్‌కే)
5314 - ఎంఎస్ ధోనీ (సీఎస్‌కే)
ఈ మ్యాచ్ ద్వారానే కింగ్ కోహ్లీ మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ ఒక సీజన్‌లో అత్యధికసార్లు 600 ప్లస్ పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. ఈ ఫీట్‌ను అతడు ఇప్పటివరకు ఐదుసార్లు సాధించాడు.
ఒకే ఎడిషన్‌లో 600 కంటే ఎక్కువ రన్స్ చేసింది వీరే..
5 - విరాట్ కోహ్లీ (2013, 2016, 2023, 2024, 2025)
4 - కేఎల్ రాహుల్ (2018, 2020, 2021, 2022)
3 - క్రిస్ గేల్ (2011, 2012, 2013)
3 - డేవిడ్ వార్నర్ (2016, 2017, 2019)