Ashok Gajapathi Raju: ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తున్న చంద్రబాబు బాటలో అందరం నడవాలి: అశోక్ గజపతి రాజు

- కడపలో రెండో రోజు టీడీపీ మహానాడు సభలు
- మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు ప్రసంగం
- తెలుగువారి ఘనతను చాటి చెప్పిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ అంటూ ప్రశంస
- ఆ ఘనతను స్ఫూర్తిగా తీసుకొని భావితరాలకు ఆదర్శంగా ఉండాలని పిలుపు
కడపలో రెండో రోజు టీడీపీ మహానాడు సభలు ప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నేతలు ఆయనకు నివాళులు అర్పించారు. అనంతరం మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు ప్రసంగించారు. తెలుగువారి ఘనతను చాటి చెప్పిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ అని అన్నారు. ఆ ఘనతను స్ఫూర్తిగా తీసుకొని భావితరాలకు ఆదర్శంగా ఉండాలని పిలుపునిచ్చారు.
జీవించాక మరణించక తప్పదు.. మరణించినా ప్రజల గుండెల్లో నిలబడటం చాలా గొప్ప విషయం అన్నారు. అలా ఉన్న వ్యక్తే అన్న నందమూరి తారక రామారావు అని కొనియాడారు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తున్న నారా చంద్రబాబు బాటలో అందరం నడవాలని అశోక్ గజపతి రాజు తెలిపారు. మహాత్ములని స్ఫూర్తిగా తీసుకొని నడిచిన నందమూరి నేడు మనందరికి స్ఫూర్తిగా నిలిచారన్నారు.
పసుపు అంటే పుణ్యమైన రంగు.. ఆ చక్రం శ్రమ జీవులకోసం, ఆ నాగలి రైతులకోసం ఆ గుడిసే అందరికి ఇళ్లకోసం ఇది పేదలకోసం పుట్టిన జెండా.. ప్రజలకోసం నిలిసిన పార్టీ అని చెప్పారు. ఆత్మగౌరవంతో ఉండాలని ఎన్టీఆర్ ఆకాంక్షించేవారని ఈ సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి గుర్తు చేశారు. మనం నిర్భయంగా పనిచేయగలితే మన ఆత్మగౌరవాన్ని పెంచుకోగలుగుతామన్నారు.
నాడు అన్నగారిపై కూడా అక్రమ కేసులు పెట్టారని, అయినా ముఖ్యమంత్రి హోదాలో కోర్టుకు వెళ్లి సమాధానం ఇచ్చారని తెలిపారు. అలాగే చంద్రబాబును అక్రమంగా 52 రోజులు జైల్లో పెట్టినా ఆయన అధైర్య పడలేదన్నారు. గత ప్రభుత్వం లాంటి పాలనను తానేప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. తెలుగు భాష, తెలుగు సంస్కృతి ఉన్నంత వరకు తెలుగుదేశం ఉంటుందన్నారు.
ప్రజలకోసం పనిచేసే పార్టీ.. ఆత్మగౌరవాన్ని పెంచే పార్టీ టీడీపీ అని తెలిపారు. ఎక్కడున్నా తెలుగువారి కీర్తిని చాటి చెప్పాలన్నారు. భవిష్యత్తు మన యువకులది.. అందరు కలిసి పనిచేయాలని అశోక్ గజపతి రాజు పిలుపునిచ్చారు.