Archana: అందుకే నా పేరు మార్చమన్నాను: సీనియర్ నటి అర్చన

Archana Interview
  • తాను క్లాసికల్ డాన్సర్ అని చెప్పిన అర్చన  
  • అమ్మగారివాళ్లది ఆంధ్రప్రదేశ్అని వెల్లడి  
  • తనని పరిచయం చేసింది బాలూమహేంద్ర గారని వివరణ  
  • తన అభిమాన నటి జయసుధ గారని చెప్పిన అర్చన 

అర్చన అనే పేరు వినగానే అందరికీ గుర్తొచ్చే సినిమా 'నిరీక్షణ'. బాలూ మహేంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా, 1982లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథాకథనాల పరంగా ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అలాంటి అర్చనకి 'లేడీస్ టైలర్' సినిమా కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమా తరువాత ఆమె రాజేంద్రప్రసాద్ తో చేసిన తాజా చిత్రమే 'షష్ఠి పూర్తి'. ఈ నెల 30వ తేదీన ఈ సినిమా విడుదలవుతోంది. 

ఈ నేపథ్యంలో సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అర్చన మాట్లాడుతూ .. "నేను క్లాసికల్ డాన్స్ నేర్చుకుని నటన వైపు వచ్చాను. మా అమ్మగారువాళ్లు ఆంధ్రప్రదేశ్ కి చెందినవారు కావడం వలన, నాకు తెలుగు బాగానే వచ్చు. తెలుగులో 'MLA  ఏడుకొండలు' సినిమాలో చిన్న వేషం వేశాను. హీరోయిన్ గా చేసిన ఫస్టు మూవీ 'నిరీక్షణ'. బాలూ మహేంద్ర గారు ఈ సినిమాతో నన్ను హీరోయిన్ గా పరిచయం చేశారు" అని అన్నారు. 

" నా అసలు పేరు సుధ. నేను ఇండస్ట్రీకి వచ్చే సమయానికి తెలుగు .. తమిళ భాషల్లో జయసుధగారు స్టార్ హీరోయిన్. నిజం చెప్పాలంటే నేను ఆమె అభిమానిని. అందువలన 'సుధ' అనే నా పేరు ఆమె పేరుకు దగ్గరగా ఉండటం నాకే నచ్చలేదు. జయసుధ గారిపట్ల గౌరవంతోనే నా పేరును మార్చుకోవాలని అనుకున్నాను. అదేవిషయం బాలూ మహేంద్రగారితో చెప్పాను. అప్పుడు ఆయనే నా పేరును 'అర్చన' అని మార్చారు" అని అన్నారు. 

Archana
Nireekshana movie
Ladies Tailor
Rajendra Prasad
Shashti Poorti movie
Balu Mahendra
Telugu cinema
South Indian actress
MLA Yedukondalu
Classical dance

More Telugu News