Sukumar: వాళ్లిద్దరి ముందు మాట్లాడాలంటే కాస్త టెన్షన్ గా ఉంది: సుకుమార్

Sukumar feels nervous speaking before Arjun and Upendra
  • అర్జున్ నటించిన హనుమాన్ జంక్షన్ మూవీకి తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశానన్న సుకుమార్
  • స్క్రీన్ ప్లే విషయంలో ఉపేంద్ర  సినిమాలను తాను ఫాలో అయ్యే వాడినన్న సుకుమార్
  • ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేయడం ఉపేంద్రకు అలవాటు.. దాన్ని నేను చోరీ చేశానన్న సుకుమార్  
అర్జున్, ఉపేంద్రలు నటులే కాదు దర్శకులు కూడా. అందుకే వారి ముందు మాట్లాడాలంటే కాస్త టెన్షన్‌గా ఉందని ప్రముఖ దర్శకుడు సుకుమార్ వ్యాఖ్యానించారు. నటుడు అర్జున్ దర్శకత్వంలో ఆయన కుమార్తె ఐశ్వర్య, నిరంజన్ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం 'సీతా పయనం' టీజర్ లాంచ్ కార్యక్రమం బుధవారం జరిగింది.

ఈ కార్యక్రమంలో సుకుమార్ మాట్లాడుతూ, అర్జున్ నటించిన హనుమాన్ జంక్షన్ చిత్రానికి తాను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ఆయనను దూరం నుంచి చూసేవాడినని, ఆయన అప్పటికీ, ఇప్పటికీ ఒకేలా ఉన్నారని పేర్కొన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అర్జున్ వెనకడుగు వేయలేదని అన్నారు.

జైహింద్ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా ఆయన తనను తాను నిరూపించుకున్నారని అన్నారు. తన కుమార్తె కోసం 'సీతా పయనం' సినిమా చేస్తున్నారని, ఈ సినిమా ప్రయాణాన్నే ఓ చిత్రంగా తెరకెక్కించవచ్చని సుకుమార్ అన్నారు.

ఉపేంద్ర గురించి మాట్లాడుతూ, స్క్రీన్ ప్లే విషయంలో ఆయన సినిమాలను తాను అనుసరించేవాడినని చెప్పారు. ‘ఏ’, ‘ఓం’, ‘ఉపేంద్ర’ వంటి చిత్రాలు తెరకెక్కించిన ఏ దర్శకుడైనా రిటైర్ అయిపోవచ్చని, ఒకవేళ అలాంటి చిత్రాలు నేను చేసి ఉంటే రిటైర్ అయిపోయేవాడినని సుకుమార్ అన్నారు. తన చిత్రాల స్క్రీన్ ప్లేకు స్ఫూర్తి ఉపేంద్ర తెరకెక్కించిన ఈ మూడు సినిమాలేనని చెప్పారు. ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేయడం ఆయనకు అలవాటని, దాన్ని నేను దొంగిలించానని సుకుమార్ నవ్వుతూ చెప్పుకొచ్చారు. 
Sukumar
Arjun Sarja
Upendra
Seetha Payanam
Aishwarya Arjun
Niranjan
Telugu cinema
Hanuman Junction
Jai Hind movie
Screenplay

More Telugu News